Two MPs don’t take salary | ఇద్దరు లోక్సభ ఎంపీలు జీతం తీసుకోవడం లేదు.. వారు ఎవరంటే?
Two MPs don't take salary | సాధారణంగా తమ జీతాలు, ప్రోత్సాహకాలను పెంచుకునే విషయంలో పార్టీలకు అతీతంగా పార్లమెంటు సభ్యులు కలిసి ముందుకు వస్తారు. అయితే నయా పైసా జీతం కూడా తీసుకోని సభ్యులు కూడా ఉన్నారు. ప్రస్తుత లోక్సభలో ఇద్దరు ఎంపీలు తమ వేతనం తీసుకోవడం లేదు. వారిలో ఒకరు బీజేపీ ఎంపీ కాగా మరొకరు కాంగ్రెస్ ఎంపీ.
న్యూఢిల్లీ: సాధారణంగా తమ జీతాలు, ప్రోత్సాహకాలను పెంచుకునే విషయంలో పార్టీలకు అతీతంగా పార్లమెంటు సభ్యులు కలిసి ముందుకు వస్తారు. అయితే నయా పైసా జీతం కూడా తీసుకోని సభ్యులు కూడా ఉన్నారు. ప్రస్తుత లోక్సభలో ఇద్దరు ఎంపీలు తమ వేతనం తీసుకోవడం లేదు. (Two MPs don’t take salary) వారిలో ఒకరు బీజేపీ ఎంపీ కాగా మరొకరు కాంగ్రెస్ ఎంపీ. బీజేపీకి చెందిన హర్యానాలోని కురుక్షేత్ర ఎంపీ నవీన్ జిందాల్, కాంగ్రెస్కు చెందిన ఇన్నర్ మణిపూర్ ఎంపీ డాక్టర్ బిమోల్ అకోయిజామ్ అంగోమ్చా తమ జీతాలు తీసుకోకూడదని నిర్ణయించారు. అంతేగాక అధికారిక భత్యాలతోపాటు ప్రోత్సాహకాలను కూడా నవీన్ జిందాల్ తీసుకోవడం లేదు. సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నకు లోక్సభ సెక్రటేరియట్ ఈ మేరకు సమాధానం ఇచ్చింది.
కాగా, బీజేపీ ఎంపీ నవీన్ జిందాల్ ఎన్నికల అఫిడవిట్లో రూ.1,241 కోట్ల విలువైన ఆస్తులను ప్రకటించారు. ఇన్నర్ మణిపూర్కు ప్రాతినిధ్యం వహిస్తున్న డాక్టర్ బిమోల్ అకోయిజామ్ అంగోమ్చా సుమారు రూ.97 లక్షల ఆస్తులను వెల్లడించారు.
మరోవైపు 18వ లోక్సభలో అత్యంత ధనవంతులైన సభ్యులలో నవీన్ జిందాల్ ఒకరు మాత్రమే. అత్యంత ధనవంతుడైన సభ్యుడు మాత్రం ఆయన కాదు. గుంటూరుకు చెందిన తెలుగుదేశం పార్టీ ఎంపీ చంద్రశేఖర్ పెమ్మసాని ఈ ప్రత్యేకత దక్కించుకున్నారు. ఆయన ఆస్తుల విలువ రూ.5,705 కోట్లకు పైగా ఉన్నది. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి రూ.4,568 కోట్లకు పైగా ఆస్తుల ప్రకటనతో రెండో స్థానంలో ఉన్నారు.
Also Read:
Arunachal BJP MP | ‘ఈశాన్య ప్రజలకు ఢిల్లీ సురక్షితం కాదు’.. బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
S Jaishankar | మూడు నౌకల డాకింగ్కు ఇరాన్ అనుమతి కోరింది.. మార్చి 1న ఇచ్చాం: ఎస్ జైశంకర్
Man Sets Partner on Fire | స్కూటీ ఇచ్చేందుకు నిరాకరణ.. మహిళ, ఆమె పేరెంట్స్కు నిప్పంటించిన వ్యక్తి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

