Court Cancels Congress MLA’s Election | కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్నికను రద్దు చేసిన హైకోర్టు.. బీజేపీ నేతను విజేతగా ప్రకటన
Court Cancels Congress MLA's Election | ఉప ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్నికను హైకోర్టు రద్దు చేసింది. తర్వాత స్థానంలో నిలిచిన బీజేపీ నేతను విజేతగా ప్రకటించింది. అయితే ఈ తీర్పుపై ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేసేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేకు వారం గడువు ఇచ్చింది.
భోపాల్: ఉప ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్నికను హైకోర్టు రద్దు చేసింది. తర్వాత స్థానంలో నిలిచిన బీజేపీ నేతను విజేతగా ప్రకటించింది. అయితే ఈ తీర్పుపై ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేసేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేకు వారం గడువు ఇచ్చింది. (Court Cancels Congress MLA’s Election) మధ్యప్రదేశ్‌లోని విజయ్‌పూర్ అసెంబ్లీ స్థానానికి గత ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ముఖేష్ మల్హోత్రా గెలిచారు. ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికయ్యారు.
కాగా, నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో క్రిమినల్ కేసుల గురించి కీలకమైన సమాచారాన్ని ముఖేష్ మల్హోత్రా దాచిపెట్టినట్లు బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి రాంనివాస్ రావత్ ఆరోపించారు. మధ్యప్రదేశ్ హైకోర్టు గ్వాలియర్ బెంచ్‌ను ఆయన ఆశ్రయించారు.
మరోవైపు ఈ పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపింది. ముఖేష్ మల్హోత్రా తన నామినేషన్ అఫిడవిట్లో నాలుగు క్రిమినల్ కేసుల పూర్తి వివరాలను అందించడంలో విఫలమయ్యారని ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఆయన ఎన్నికను రద్దు చేసింది. తర్వాత స్థానంలో నిలిచిన బీజేపీ నేత రాంనివాస్ రావత్‌ను విజేతగా ప్రకటించింది.
అయితే ఈ తీర్పును ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేసేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే ముఖేష్ మల్హోత్రాకు కోర్టు వారం గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలో తీర్పుపై 15 రోజులు స్టే విధించింది.
Also Read:
S Jaishankar | మూడు నౌకల డాకింగ్‌కు ఇరాన్ అనుమతి కోరింది.. మార్చి 1న ఇచ్చాం: ఎస్ జైశంకర్
Man Sets Partner on Fire | స్కూటీ ఇచ్చేందుకు నిరాకరణ.. మహిళ, ఆమె పేరెంట్స్‌కు నిప్పంటించిన వ్యక్తి
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BJP
- Cancels
- Congress MLA
- declares
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

