US miffed on Israel with WTF | ఇరాన్ ఆయిల్ నిల్వలపై ఇజ్రాయెల్ దాడులు.. ‘డబ్ల్యూటీఎఫ్’ పదజాలంతో అమెరికా ఆగ్రహం
US miffed on Israel | ఇరాన్ ఆయిల్ నిల్వల లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేయడంపై అమెరికా మండిపడింది. ఏం చేస్తున్నావంటూ ‘డబ్ల్యూటీఎఫ్’ పదజాలంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంలో అమెరికా, ఇజ్రాయెల్ మధ్య తొలిసారి తీవ్ర స్థాయిలో విభేదాలు తలెత్తినట్లు యాక్సియోస్ వార్తా సంస్థ పేర్కొంది.
వాషింగ్టన్: ఇరాన్ ఆయిల్ నిల్వల లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేయడంపై అమెరికా మండిపడింది. ఏం చేస్తున్నావంటూ ‘డబ్ల్యూటీఎఫ్’ పదజాలంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంలో అమెరికా, ఇజ్రాయెల్ మధ్య తొలిసారి తీవ్ర స్థాయిలో విభేదాలు తలెత్తినట్లు యాక్సియోస్ వార్తా సంస్థ పేర్కొంది. (US miffed on Israel) శనివారం ఇరాన్ రాజధాని టెహ్రాన్, పరిసర ప్రాంతాల్లోని 30 చమురు డిపోలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. దీంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఇరాన్ రాజధానిలోని పలు ప్రాంతాలను దట్టమైన పొగలు చుట్టుముట్టాయి. యాసిడ్ వర్షం పడే అవకాశం ఉండటంతో ప్రజలు తమ ఇళ్లలోనే ఉండాలని ఇరాన్ ప్రభుత్వం అప్రమత్తం చేసింది.
కాగా, ఇరాన్ ఆయిల్ డిపోలపై దాడుల గురించి ఇజ్రాయెల్ ముందుగానే అమెరికాకు తెలియజేసింది. అయితే ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా ఇరాన్ చమురు నిల్వలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకున్నది. దీంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారని అమెరికా సీనియర్ అధికారి ఒకరు ‘యాక్సియోస్’తో అన్నారు. ‘ఇది అమెరికా అధ్యక్షుడికి నచ్చలేదు’ అని ట్రంప్ కార్యాలయం ఇజ్రాయెల్‌కు స్పష్టం చేసిందన్నారు. ‘వాట్ ద ఫ*’ పదజాలంతో ట్రంప్ ఆగ్రహంతో కూడిన సందేశాన్ని కూడా వైట్‌హౌస్ పంపినట్లు అమెరికా అధికారి తెలిపారు. ఇజ్రాయెల్‌ను ఈ మేరకు ట్రంప్ గట్టిగా హెచ్చరించినట్లు పేర్కొన్నారు.
మరోవైపు రోజువారీ పౌర వినియోగానికి సంబంధించిన సౌకర్యాలపై దాడులు ఊహించని పరిణామాలను కలిగిస్తాయని అమెరికా ఆందోళన చెందినట్లు ఆ అధికారి తెలిపారు. అలాగే ఇరాన్ ప్రభుత్వానికి ప్రజల మద్దతు కూడగట్టే అవకాశంతో పాటు ప్రపంచ చమురు ధరలు పెరిగే పరిణామంపై ట్రంప్ ఆందోళన వ్యక్తం చేసినట్లు చెప్పారు. ‘ఈ దాడి అధ్యక్షుడికి ఇష్టం లేదు. ఆయన చమురును ఆదా చేయాలనుకుంటున్నారు. దానిని మండించేందుకు ఇష్టపడరు. ఇది అధిక గ్యాస్ ధరలను ప్రజలకు గుర్తు చేస్తుంది’ అని ట్రంప్ సలహాదారుడు అన్నట్లు ‘యాక్సియోస్’ పేర్కొంది. అయితే ఈ మీడియా కథనంపై వ్యాఖ్యానించేందుకు వైట్ హౌస్, లేదా ఇజ్రాయెల్ సైన్యమైన ఐడీఎఫ్ నిరాకరించాయి.
కాగా, తమ చమురు మౌలిక సదుపాయాలపై నిరంతర దాడులు ఈ ప్రాంతం అంతటా ప్రతీకార చర్యలకు దారితీస్తాయని ఇరాన్ హెచ్చరించింది. ‘టెహ్రాన్ ఇప్పటివరకు విస్తృత స్థాయిలో ఇంధన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోలేదు. కానీ పునరాలోచించుకోవచ్చు’ అని ఇరాన్ సైనిక అధికారి మీడియాతో అన్నారు. ఈ ప్రాంతంలోని ఇంధన నిల్వలపై ఇరాన్ దాడి చేయడం ప్రారంభిస్తే, ప్రపంచ చమురు ధరలు బ్యారెల్‌కు 200 అమెరికా డాలర్ల వరకు (రూ. 18,461) పెరుగవచ్చని ఆయన హెచ్చరించారు.
Also Read:
Donald Trump: యుద్ధం ముగింపుపై నెతన్యహూతో కలిసి నిర్ణయం తీసుకుంటా: ట్రంప్
Iran-Israel-US War | అలా చేస్తే ఆస్తులు సీజ్ చేస్తాం.. విదేశాల్లో ఉంటున్న పౌరులకు ఇరాన్ హెచ్చరిక
Mojtaba Khamenei | ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌గా ఖమేనీ తనయుడు మొజ్తాబా ఖమేనీ.. ప్రకటించిన ఇరాన్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 17-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

