న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు ఢిల్లీ సురక్షితం కాదని బీజేపీ ఎంపీ అన్నారు. కేంద్ర ప్రభుత్వంతోపాటు బీజేపీ ప్రభుత్వం ఉన్న దేశ రాజధానిలో ఈశాన్య ప్రజలపై జరుగుతున్న దాడులపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. (Arunachal BJP MP) అరుణాచల్ ప్రదేశ్కు చెందిన బీజేపీ ఎంపీ తపిర్ గావో సోమవారం పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో ఈశాన్య రాష్ట్రాల ప్రజల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజలపై జాతి వివక్షత చూపడంతోపాటు దాడుల సంఘటనలు కొనసాగుతున్నాయని తెలిపారు. ‘ఢిల్లీలోనే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మెట్రోపాలిటన్ నగరాల్లో కూడా ఈశాన్య ప్రాంతాల ప్రజలు జాతి వివక్ష, దాడులు, హత్యలను ఎదుర్కొంటున్నారు’ అని అన్నారు.
కాగా, ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతామని బీజేపీ ఎంపీ తపిర్ గావో తెలిపారు. తమ ప్రాంతం పౌరులను రక్షించడానికి బలమైన చట్టపరమైన చట్రాన్ని తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతామని చెప్పారు. కేంద్ర హోంమంత్రిని కూడా ప్రతినిధి బృందం కలుస్తుందని అన్నారు. ఈశాన్య ప్రాంతాల ప్రజలపై వివక్ష, హింసను నివారించడానికి అట్రాసిటీ చట్టం లాంటి చట్టాన్ని తీసుకురావడాన్ని కేంద్రం పరిగణించాలని ఆయన సూచించారు.
Also Read:
S Jaishankar | మూడు నౌకల డాకింగ్కు ఇరాన్ అనుమతి కోరింది.. మార్చి 1న ఇచ్చాం: ఎస్ జైశంకర్
Man Sets Partner on Fire | స్కూటీ ఇచ్చేందుకు నిరాకరణ.. మహిళ, ఆమె పేరెంట్స్కు నిప్పంటించిన వ్యక్తి