హైదరాబాద్, జూలై 28 : గతేడాది హైదరాబాద్లో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ను ఏర్పాటు చేసిన అంతర్జాతీయ టెక్నాలజీ సంస్థ సోనాటైప్ ఉద్యోగులను పెంచుకునేపనిలో పడింది.
ప్రస్తుతం ఈ సెంటర్లో వంద మంది టెక్నాలజీ నిపుణులు విధులు నిర్వహిస్తుండగా, ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఈ సంఖ్యను 200కి పెంచుకోనున్నట్టు కంపెనీ సీనియర్ డైరెక్టర్ అభిశేక్ చౌహాన్ తెలిపారు. ఏఐ టెక్నాలజీతో దేశీయ సాఫ్ట్వేర్ రంగంలో అవకాశాలు, ఆవశ్యకత, ప్రతికూల ప్రభావాలపై నివేదికను ఆయన విడుదల చేశారు.