కోల్‌కతా: గోడౌన్లలో జరిగిన అగ్నిప్రమాదం ఘటనలో మరణించిన వారి సంఖ్య 21కు చేరింది. మరో 28 మంది అదృశ్యమయ్యారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరుగవచ్చని పోలీస్ అధికారి తెలిపారు. (Kolkata Fire) జనవరి 26న పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా సమీపంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని ఆనందపూర్‌లో రెండు గోదాములు, ఒక మోమో తయారీ కర్మాగారం పూర్తిగా కాలి బూడిదయ్యాయి. వాటిలో పని చేసే కార్మికులు సజీవ దహనమయ్యారు.
కాగా, కాలిన భవనాల నుంచి తాజాగా 13 మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. దీంతో మృతుల సంఖ్య 21కు చేరినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఇంకా 28 మంది ఆచూకీ లభించలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరుగవచ్చని అన్నారు. ఇప్పటి వరకు వెలికితీసిన 21 మృతదేహాలకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించి మృతులను గుర్తించనున్నట్లు వెల్లడించారు.
మరోవైపు బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి, ఇతర బీజేపీ నాయకులు అగ్నిప్రమాద ప్రాంతాన్ని సందర్శించాలని నిర్ణయించారు. అయితే పోలీసులు అక్కడ నిషేధిత ఆజ్ఞలు విధించారు. ప్రజల రాకపోకలను నియంత్రించారు. ఈ నేపథ్యంలో సమీపంలోని ఆలయం నుంచి సంఘటనా స్థలానికి పాదయాత్ర కోసం అనుమతి కోరుతూ సువేందు అధికారి కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు.
Also Read:
Delhi LG VK Saxena | మేధా పాట్కర్ పరువు నష్టం కేసులో.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నిర్దోషి
Sadhvi Prem Baisa | సాధ్వి అనుమానాస్పద మృతి.. సోషల్ మీడియా పోస్ట్‌పై పలు సందేహాలు
Watch: మహిళను దారుణంగా కొట్టి.. లైంగికంగా వేధించిన బీజేపీ నేత
Watch: లోయలోకి దూసుకెళ్లబోయిన బస్సు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం