Students Insulted : ఆంధ్రప్రదేశ్ జిల్లాలోని ఒక ప్రైవేట్ స్కూల్లో క్రమశిక్షణ పేరిట అమానుష ఘటన జరిగింది. విద్యార్ధులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయురాలు వారి మెడలో చెప్పుల దండ వేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఇంతకూ ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే.. కృష్ణా జిల్లా ఉయ్యూరులోని విజయసాయి స్కూల్(Vijaya Sai School)లో 10 మంది విద్యార్ధులు బూట్లు వేసుకురాలేదు. దాంతో టీచర్ కనకలక్ష్మి (Kanakalaxmi) వారిపై ఆగ్రహంతో అమానుషంగా ప్రవర్తించింది.
ఆ పది మంది మెడలో చెప్పుల దండ వేసి, తోటి విద్యార్థుల ముందు నిలబెట్టింది. ఇంటికి వెళ్లిన తర్వాత టీచర్ కనకలక్ష్మి తమను అవమానించిన తీరును విద్యార్థులు తల్లిదండ్రులకు చెప్పుకొని భోరున ఏడ్చారు. టీచర్ తీరుపై కోపోద్రిక్తులైన వారి తల్లిదండ్రులు.. మీ టీచర్ ప్రవర్తించిన తీరు దారుణంగా ఉందని పాఠశాల యాజమాన్యాన్ని నిలదీశారు. అయితే.. పిల్లలు క్రమశిక్షణతో ఉంటారనే ఇలా చేశామంటూ సదరు టీచర్ జవాబు చెప్పింది. యావత్ జిల్లా వ్యాప్తంగా కలకలం రేపిన ఈ అమానుష ఘటనపై విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు.
ఏపీలో విద్యార్ధుల మెడలో చెప్పుల దండ వేసిన టీచర్
కృష్ణా జిల్లా ఉయ్యూరులోని విజయసాయి స్కూల్ లో అమానుష ఘటన
బూట్లు వేసుకురాలేదని 10 మంది విద్యార్థుల మెడలో చెప్పుల దండ వేసి, తోటి విద్యార్థుల ముందు నిలబెట్టిన టీచర్ కనకలక్ష్మి
ఇంటికెళ్ళి విద్యార్థులు జరిగిన విషయం చెప్పడంతో, పాఠశాల… pic.twitter.com/g48601vFIp
— Telugu Scribe (@TeluguScribe) March 7, 2026