బెంగళూరు: ఒక వ్యక్తి రాత్రివేళ ఇంటి గోడలు దూకుతున్నాడు. మహిళల లోదుస్తులు దొంగిలిస్తున్నాడు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఇది తెలుసుకున్న ఆ ప్రాంత మహిళలు ఆందోళన చెందుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేస్తున్నారు. (Man Steals Women’s Innerwear) కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గత కొన్ని రోజులుగా గంగావతి పట్టణంలో ఒక వ్యక్తి మహిళల లోదుస్తులు దొంగిలిస్తున్నాడు. రాత్రివేళ ఇళ్ల ప్రహరీ గోడలు దూకి లోనికి వెళ్తున్నాడు. బయట వైర్ పై ఆరవేసిన మహిళల లోదుస్తులను ఎత్తుకెళ్తున్నాడు.
కాగా, గంగావతి నగరంలోని ప్రముఖ నివాస ప్రాంతమైన సీబీఎస్ లేఅవుట్లో గత నాలుగు రోజులుగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా స్థానికులు దీనిని గుర్తించారు. దీంతో లోదుస్తుల చోరీపై స్థానిక మహిళలు ఆందోళన చెందుతున్నారు.
మరోవైపు గంగావతి టౌన్ పోలీస్ స్టేషన్కు పలు ఫిర్యాదులు అందాయి. మహిళల లోదుస్తులు చోరీ చేస్తున్న ఆ దొంగ ‘సైకో’ అని కొందరు అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నిందితుడ్ని గుర్తించి అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఒక ఇంటి వద్ద ఉన్న సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
A series of unusual thefts has been reported from the CBS layout of Gangavati town in Koppal district, where a miscreant has allegedly been targeting homes over the past few days.
According to residents, the individual has been climbing compound walls at night and stealing… pic.twitter.com/s6z8dsfyL5
— Hate Detector 🔍 (@HateDetectors) March 30, 2026
Also Read:
Man Dupes High Court Judge | హైకోర్టు న్యాయమూర్తిని ఆరు లక్షలకు మోసగించిన వ్యక్తి.. అరెస్ట్
Nitish Kumar | శాసన మండలి సభ్యత్వానికి.. నితీశ్ కుమార్ రాజీనామా