దేశవ్యాప్తంగా ఓబీసీ కులగణన చేపట్టాలి
- జనగణనలోనే ఓబీసీలకు ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయాలి: శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా ఓబీసీ కులగణన చేపట్టాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. జనగణనలోనే ఓబీసీలకు ప్రత్యేక కా లమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. శనివారం ఆల్ ఇండియా ఓబీసీ కులగణన కో ఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ప్రస్తుతం జనగణన కోసం కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.11,700 కోట్లు ఖర్చు చేస్తున్నదని, జనగణనలో ఎస్సీ, ఎస్టీల మాదిరిగా ఓబీసీల కోసం ప్రత్యేక కాలమ్, కులాల వారీగా ప్రత్యేక కోడ్, డ్రాప్ డౌన్ జాబితాను ఏర్పాటు చేస్తే అదనంగా ఒక రూపాయి కూడా ఖర్చు కాదని స్పష్టం చేశారు. పారదర్శక కులగణనతోనే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడం సాధ్యమవుతుందని చెప్పారు.
గతంలో కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని, పార్లమెంట్లో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సైతం ఈ అంశాన్ని లేవనెత్తారని గుర్తు చేశారు. కేంద్రంలో ప్రత్యేక ఓబీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని, రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తివేసి చట్టసభల్లో బీసీలకు జనాభా ప్రాతిపదికన రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

