సదా నీ నామస్మరణే!
స్వామీ.. నీవేం పుణ్యం చేసుకో పుట్టావో భక్తులు వైరివీరులు నిత్యం నీ నామస్మరణే!
స్వామీ..
నీవేం పుణ్యం చేసుకో పుట్టావో
భక్తులు వైరివీరులు
నిత్యం నీ నామస్మరణే!
భ్రమలతో యజ్ఞఫలాల్ని
ధ్వంసం చేసుకున్నామని విధేయులు,
రక్షించేవాడు రాడని, రాలేడని వైరివీరులు
నీ నామాన్ని ప్రవరగా వల్లెవేస్తున్నారు!
యుద్ధం లేని విధ్వంసం కండ్ల ముందు కన్నీళ్లతో భక్తులు
ఎదురేలేదని వైరివీరులు గోబెల్స్‌లా
నిన్ను నిత్య ప్రచారంతో ఊరేగిస్తున్నారు!
నీవు గడప దాటితే చాలు
రోడ్లన్నీ జనసముద్రాలవుతాయి
జనాకర్షణ రహస్యమెరుగని శత్రు శిబిరాలు
వట్టి కుప్పిగంతులతో నిన్ను కవ్విస్తున్నారు.
నువ్వు జనం గుండెల్లో కొలువైన తీరు
బోధపడేలా కదలిరా స్వామి.. కదలిరా.
-కోట్ల వెంకటేశ్వరరెడ్డి ,94402 33261
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

