Nitish Kumar | శాసన మండలి సభ్యత్వానికి.. నితీశ్ కుమార్ రాజీనామా
Nitish Kumar | బీహార్ సీఎం నితీశ్ కుమార్ తన శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇటీవల రాజ్యసభకు ఆయన ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని వదులుకున్నారు. సీఎం పదవికి కూడా త్వరలో రాజీనామా చేయనున్నారు.
పాట్నా: బీహార్ సీఎం నితీశ్ కుమార్ తన శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు.
ఇటీవల రాజ్యసభకు ఆయన ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని వదులుకున్నారు. సీఎం పదవికి కూడా త్వరలో రాజీనామా చేయనున్నారు. మార్చి 16న బీహార్ స్థానాలకు జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో నితీశ్ కుమార్ (Nitish Kumar) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే రెండు సభల్లో సభ్యత్వం కలిగి ఉన్నప్పుడు, ఏదో ఒక సభ్యత్వానికి రాజీనామా చేయడానికి 14 రోజుల గడువును రాజ్యాంగం నిర్దేశించింది.
కాగా, మార్చి 30తో ఈ గడువు ముగియనున్నది. ఈ నేపథ్యంలో రాజ్యసభకు ఎన్నికైన నితీశ్ కుమార్ తన శాసన మండలి సభ్యత్వానికి సోమవారం రాజీనామా చేశారు. సీఎం పదవికి కూడా త్వరలో రాజీనామా చేయనున్నారు. ఏప్రిల్ 9న నితీశ్ కుమార్ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.
మరోవైపు 1985లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నితీశ్ కుమార్ తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2005లో తొలిసారి బీహార్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. పలు రాజకీయ కూటములు మారుతూ రికార్డు స్థాయిలో బీహార్ పదో సీఎంగా ఉన్న నితీశ్ కుమార్ త్వరలో ఆ పదవికి కూడా రాజీనామా చేయనున్నారు.
అయితే బీహార్ చరిత్రలో తొలిసారి బీజేపీ నేత సీఎం పదవి చేపట్టనున్నారు. డిప్యూటీ సీఎం, బీజేపీ శాసనసభా పక్ష నేత సామ్రాట్ చౌదరి ప్రధాన పోటీదారుగా కనిపిస్తున్నారు. నితీశ్ కుమార్ కూడా ఆయనకు బహిరంగంగా మద్దతిచ్చారు. సమృద్ధి యాత్ర సందర్భంగా సామ్రాట్ చౌదరి భుజంపై చేయి వేసిన నితీశ్, ఆయనకు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు.
All the reports say Nitish Kumar has resigned as MLC due to compulsion or he would have got automatically disqualified from tomorrow.
But….
No reports say : Nitish Kumar resigned from CM Post.
What’s happening ? Is he continuing for 6 months more?pic.twitter.com/Uhtbz72LoA
— With Love Bihar (@WithLoveBihar) March 30, 2026
Also Read:
woman finds Rs 10 crore in account | బ్యాంకు ఖాతాలో పది కోట్లు.. ఇది చూసి షాకైన మహిళ
Man Beheads Ice-Cream Seller | ఐస్క్రీం వ్యాపారి తల నరికిన వ్యక్తి.. తెగిన తలను ఇంటికి తీసుకెళ్లాడు
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bihar
- mlc
- move
- Nitish Kumar
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay TVK | ఇండియా బ్లాక్ నిరసనల్లో చేరనున్న విజయ్ టీవీకే పార్టీ.. వెల్లడించిన వీసీకే నేత
ఇంత చేతకాని సీఎం ఎవరైనా ఉంటారా? : మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
Gadwal | గద్వాలలో భారీ వర్షం..మారిన వాతావరణంతో ఉపశమనం
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి : కలెక్టర్ అంకిత్
Besan Flour | షాపుల్లో శనగపిండి వద్దు.. ఇంట్లోనే ఇలా సులభంగా తయారు చేయొచ్చు..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

