Man Tries To Open Emergency Door | విమానం ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు వ్యక్తి యత్నం.. తనను దెయ్యం ఆవహించిందని వెల్లడి
Man Tries To Open Emergency Door | విమానం గాలిలో ఉండగా ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. దీంతో విమాన సిబ్బంది అతడ్ని అదుపులోకి తీసుకుని భద్రతా సిబ్బందికి అప్పగించారు. అయితే తనను దెయ్యం ఆవహించిందని, అందుకే తనకు తెలియకుండానే అలా చేసినట్లు ఆ వ్యక్తి చెప్పాడు.
లక్నో: విమానం గాలిలో ఉండగా ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. దీంతో విమాన సిబ్బంది అతడ్ని అదుపులోకి తీసుకుని భద్రతా సిబ్బందికి అప్పగించారు. అయితే తనను దెయ్యం ఆవహించిందని, అందుకే తనకు తెలియకుండానే అలా చేసినట్లు ఆ వ్యక్తి చెప్పాడు. (Man Tries To Open Emergency Door) శనివారం రాత్రి 8.15 గంటలకు ఇండిగో విమానం బెంగళూరు నుంచి వారణాసికి బయలుదేరింది. ఆ విమానం గాలిలో ఉండగా ప్రయాణికుడైన ఉత్తరప్రదేశ్‌లోని మౌ జిల్లాకు చెందిన మహమ్మద్ అద్నాన్, ఎమర్జెన్సీ డోర్ ట్యాంపరింగ్‌కు ప్రయత్నించాడు. గమనించిన క్యాబిన్ సిబ్బంది అతడ్ని ప్రశ్నించారు. పొరపాటున అలా చేసినట్లు అద్నాన్ చెప్పాడు. దీంతో మరోసారి అలా చేయవద్దని అతడ్ని హెచ్చరించారు.
కాగా, శనివారం రాత్రి 10.20 గంటల సమయంలో వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యేందుకు విమానం సిద్ధమైంది. విమానం 500 అడుగుల ఎత్తులో ఉండగా మళ్లీ ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు అద్నాన్ ప్రయత్నించాడు. సిబ్బంది అలెర్ట్‌తో పైలైట్ తక్షణం స్పందించారు. ల్యాండింగ్ ప్రయత్నాన్ని విరమించారు. గాలిలో ఒక రౌండ్ తర్వాత రాత్రి 10.35 గంటలకు ఎయిర్‌పోర్ట్‌లో ఆ విమానం ల్యాండ్ అయింది.
మరోవైపు ప్రయాణికుడు అద్నాన్‌ను విమాన సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. విమానం ల్యాండ్ అయిన తర్వాత ఎయిర్‌లైన్ భద్రతా సిబ్బంది, సీఐఎస్ఎఫ్కు అతడ్ని అప్పగించారు. వారు అతడ్ని ప్రశ్నించగా వింతగా సమాధానం చెప్పాడు. తనను దెయ్యం ఆవహించిందని, అందుకే తనకు తెలియకుండానే అలా చేసినట్లు తెలిపాడు. గోవాలో విహారయాత్రకు వెళ్లి తిరిగి వస్తున్నట్లు చెప్పాడు.
కాగా, ఎయిర్పోర్ట్ పోలీసులు అద్నాన్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మౌలో నివసించే అతడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు వారణాసికి బయలుదేరినట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
woman finds Rs 10 crore in account | బ్యాంకు ఖాతాలో పది కోట్లు.. ఇది చూసి షాకైన మహిళ
Man Beheads Ice-Cream Seller | ఐస్‌క్రీం వ్యాపారి తల నరికిన వ్యక్తి.. తెగిన తలను ఇంటికి తీసుకెళ్లాడు
Watch: శోభాయాత్ర సందర్భంగా.. గాలిలోకి కాల్పులు జరిపిన బీజేపీ ఎమ్మెల్యే
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

