Ramayana | భారతీయ సినీ పరిశ్రమ నుంచి రాబోతున్న మరో మాగ్నమ్ ఓపస్ ‘రామాయణ’ . బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారి తెరకెక్కిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్‌పై ఇండియాతోపాటు వరల్డ్‌వైడ్‌గా అంచనాలు భారీగానే ఉన్నాయి. బాలీవుడ్ స్టార్ యాక్టర్ రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా కనిపించనున్నారు. ఇప్పటికే లాంచ్ చేసిన ‘రామాయణ’ ట్రైలర్ సినిమాపై అంచనాలు మరింత పెంచేస్తుంది.
ఈ ఎపిక్ ప్రాజెక్టులో మరో యాక్టర్ చేతన్ హన్స్‌రాజ్ ఏకంగా ఏడు పాత్రలు పోషించడం విశేషం. ఈ ఏడు రోల్స్‌లో ఒకటి రాజమలి (Raja Mali). తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు చేతన్ హన్స్‌రాజ్. రామాయణలో రావణుడి తాతగా రాజమలి పాత్రలో నటిస్తున్నాడు. రామాయణలో యశ్‌తో కలిసి నటించిన సీన్లు తన అనుభవంలో మేజర్ హైలెట్స్‌లో ఒకటిగా నిలిచాయని పేర్కొన్నారు. రాజ మలి పాత్రతోపాటు చేతన్ హన్స్‌రాజ్ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో సాగే మరో ఆరు పాత్రల్లో నటించానని చెప్పాడు. ఈ పాత్రలు తన మెయిన్ రోల్ కంటే ప్రత్యేకంగా ఉంటాయని.. ఈ పాత్రలు తన పర్ఫార్మెన్స్ ను డిజిటల్‌గా వినియోగించుకుని సృష్టించబడ్డాయన్నాడు.
ఎవరూ ఊహించని విధంగా రామాయణలో చేతన్ హన్స్‌రాజ్ చేస్తున్న పాత్రలు సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. రెండు పార్టులుగా రాబోతున్న రామాయణపై రానున్న రోజుల్లో ఎలాంటి క్రేజీ అప్డేట్స్ వస్తాయోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినీ జనాలు.
Harish Rao | సాగునీటి కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాసిన హరీశ్ రావు
Lok Sabha: లోక్‌సభలో 4 బిల్లులు.. సభ 2 గంటల వరకు వాయిదా
TN Assembly | తమిళనాడులో రాష్ట్ర గీతానికి పెద్దపీట.. అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం