Harish Rao | సాగునీటి కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాసిన హరీశ్ రావు
Harish rao | తక్షణమే కాళేశ్వరం మోటర్లు ఆన్ చేసి రైతుల ఇబ్బందులు తొలగించాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి హరీశ్ రావు లేఖ రాశారు.
Harish rao | తక్షణమే కాళేశ్వరం మోటర్లు ఆన్ చేసి రైతుల ఇబ్బందులు తొలగించాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి హరీశ్ రావు లేఖ రాశారు. రిజర్వాయర్లలో నీటిని సకాలంలో నింపకపోవడం వల్ల పంటలు సాగు కాక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఆందేళన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో వివిధ జిల్లాల్లో ఉన్న అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్లను నింపి, సుమారు 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందాలని, దానికోసం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మిడ్ మానేరు నుంచి మోటర్లను ఆన్ చేసి నీటి పంపింగ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఒకవైపు ఎల్నినో వల్ల తక్కువ వర్షపాతం, మరోవైపు ప్రాజెక్టుల్లో నీళ్లు లేక రైతులు ఆందోళనలో ఉన్నారు. వానాకాలం పంట సాగుకు సాగునీటి కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా లోయర్ మానేరు డ్యామ్ (LMD) పూర్తి నీటి సామర్థ్యం 24 టీఎంసీలు కాగా, ప్రస్తుతం కేవలం 6.9 టీఎంసీల నీటి లభ్యత మాత్రమే ఉందన్నారు.
మిడ్ మానేరు నుంచి లోయర్ మానేరుకు నీటిని నింపి SRSP STAGE-2లోని ఆయకట్టుకు నీరు అందించి రైతులను ఆదుకోవాలని లేఖలో కోరారు. గత యాసంగి పంటలో కాళేశ్వరం ప్రాజెక్టులోని రిజర్వాయర్ల ఆయకట్టు పరిధిలో 4 లక్షల ఎకరాలు సాగైన విషయం గుర్తించి, ఈ వానాకాలం పంటకు, అదేవిధంగా వచ్చే యాసంగి పంటకు కూడా సాగునీరు అందేలా కాళేశ్వరం ప్రాజెక్టు అంతర్భాగంలోని అన్ని రిజర్వాయర్లను నింపాలని డిమాండ్ చేశారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి హరీష్ రావు లేఖ
తక్షణమే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి రైతుల ఇబ్బందులు తొలగించాలని డిమాండ్
రిజర్వాయర్లలో నీటిని సకాలంలో నింపకపోవడం వల్ల పంటలు సాగు కాక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని పేర్కొన్న హరీష్ రావు
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో వివిధ జిల్లాల్లో… pic.twitter.com/svIo82fAMx
— Telugu Scribe (@TeluguScribe) August 10, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

