TN Assembly | తమిళనాడులో రాష్ట్ర గీతానికి పెద్దపీట.. అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం
TN Assembly | తమిళనాడు శాసనసభ (Tamil Nadu Assembly) వేదికగా రాజకీయాలకు అతీతంగా భాషాభిమానం, సాంస్కృతిక ఆత్మగౌరవం ఏకతాటిపై నిలిచాయి. తమిళ భాష (Tamil Language) గుర్తింపును చాటిచెప్పే దిశగా తమిళనాడు ముఖ్యమంత్రి (Tamil Nadu CM) విజయ్ (Vijay) కీలక తీర్మానాన్ని అసెంబ్లీ ముందుకు తీసుకొచ్చారు.
TN Assembly : తమిళనాడు శాసనసభ (Tamil Nadu Assembly) వేదికగా రాజకీయాలకు అతీతంగా భాషాభిమానం, సాంస్కృతిక ఆత్మగౌరవం ఏకతాటిపై నిలిచాయి. తమిళ భాష (Tamil Language) గుర్తింపును చాటిచెప్పే దిశగా తమిళనాడు ముఖ్యమంత్రి (Tamil Nadu CM) విజయ్ (Vijay) కీలక తీర్మానాన్ని అసెంబ్లీ ముందుకు తీసుకొచ్చారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో, విద్యాసంస్థల్లో రాష్ట్ర గీతం ‘తమిళ్ తాయ్ వాళ్తు (Tamil Thaai Vazhthu)’ మొదట ఆలపించడాన్ని తప్పనిసరి చేస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
ప్రముఖ తమిళ పండితుడు, ప్రొఫెసర్ పీ సుందరం పిళ్లై 1891లో ‘మనోన్మణియం’ అనే నాటకాన్ని రాశారు. ఆ నాటకం ప్రారంభంలో తమిళ భాషను, తమిళ నేలను ‘తమిళ తాయి (తమిళ తల్లి)’ గా కీర్తిస్తూ ‘నీరారుమ్ కడలుడుత్త’ పేరుతో పద్యాలను రాశారు. రానురాను ఇవి తమిళ ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. వివిధ సాంస్కృతిక, విద్యా కార్యక్రమాల ప్రారంభంలో ఈ పద్యాలను పాడటం ఒక అనవాయితీగా మారింది.
ఈ గీతం ప్రాముఖ్యతను గుర్తించిన నాటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కరుణానిధి 1970 మార్చి 11న కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలన్నింటినీ ఈ గీతంతోనే ప్రారంభించాలని అందులో పేర్కొన్నారు. అదే ఏడాది నవంబర్ 23న దీనిపై జీవో విడుదలైంది. నాటి నుంచి ప్రభుత్వ కార్యక్రమాల్లో దీన్ని పాడుతున్నప్పటికీ అధికారికంగా 2021లో రాష్ట్ర గీతంగా దీనికి హోదా తీసుకువచ్చారు.
2021 డిసెంబర్ 17న తమిళనాడు ప్రభుత్వం ఈ పాటను అధికారిక రాష్ట్ర గీతంగా ప్రకటించింది. విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ సభల్లో ఈ గీతాన్ని తప్పనిసరిగా ఆలపించాలని మార్గదర్శకాలు జారీచేసింది. ఈ ఏడాది మే నెలలో తమిళనాడులోని ఓ విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జాతీయ గీతం, జాతీయగేయం తర్వాత తమిళ్తాయ్ వాళ్తును పాడడంతో వివాదం మొదలైంది. అలా ఆలపించాలని గవర్నర్ సూచించడాన్ని పలువురు ప్రముఖులు తప్పుబట్టారు.
ఇది జరిగిన కొన్ని వారాలకు విజయ్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా తమిళ రాష్ట్ర గీతాన్ని మూడో స్థానంలో పాడారు. ఈ నిర్ణయం గవర్నర్ కార్యాలయం తీసుకుందని టీవీకే పార్టీ నాడు విమర్శించింది. ఈ క్రమంలోనే అధికారిక కార్యక్రమాల్లో రాష్ట్రగీతాన్ని మొదట పాడడం తప్పనిసరి చేయాలని కోరుతూ ఇటీవల 20 మంది ఎంపీలు గవర్నర్కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో తాజాగా విజయ్ ప్రభుత్వం తీర్మానం తీసుకురావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
అసెంబ్లీలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతూ సీఎం విజయ్ భావోద్వేగానికి గురయ్యారు. ‘తమిళం అనేది కేవలం మాట్లాడే భాష మాత్రమే కాదు. అది మన జీవనవిధానం, మన భావోద్వేగం. తమిళ సాంస్కృతిక మూలాలతో ముడిపడి ఉన్న అనుబంధం’ అని వ్యాఖ్యానించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

