woman finds Rs 10 crore in account | బ్యాంకు ఖాతాలో పది కోట్లు.. ఇది చూసి షాకైన మహిళ
woman finds Rs 10 crore in account | ఏటీఎంలో బ్యాంక్ బ్యాలెన్స్ చెకింగ్ కోసం ఒక మహిళ ప్రయత్నించింది. అయితే ఆమె ఖాతాలో సుమారు పది కోట్లు ఉన్నట్లు ఏటీఎం స్క్రీన్‌పై కనిపించింది. ఇది చూసి ఆ మహిళ, ఆమె కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. తమకు చెందని ఆ డబ్బును వెనక్కి తీసుకోవాలని బ్యాంకును కోరారు.
లక్నో: ఏటీఎంలో బ్యాంక్ బ్యాలెన్స్ చెకింగ్ కోసం ఒక మహిళ ప్రయత్నించింది. అయితే ఆమె ఖాతాలో సుమారు పది కోట్లు ఉన్నట్లు ఏటీఎం స్క్రీన్‌పై కనిపించింది. ఇది చూసి ఆ మహిళ, ఆమె కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. తమకు చెందని ఆ డబ్బును వెనక్కి తీసుకోవాలని బ్యాంకును కోరారు. (woman finds Rs 10 crore in account) ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. దేవ్‌గంజ్ గ్రామానికి చెందిన పరస్భన్, రీటా భార్యాభర్తలు. వ్యవసాయం ఆధారంగా వారి కుటుంబం జీవిస్తున్నది.
కాగా, బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ శాఖలో రీటాకు ఖాతా ఉన్నది. డబ్బులు డ్రా చేసేందుకు ఆ బ్యాంక్ బ్రాంచ్‌కు వారు వెళ్లారు. అయితే సాంకేతిక సమస్య వల్ల డబ్బులు తీసుకోలేకపోయారు. బ్యాంక్ సమయం ముగియడంతో ఏటీఎం ద్వారా డబ్బు తీసుకునేందుకు ప్రయత్నించారు. ఖాతాలో ఎంత డబ్బు ఉన్నదో అన్నది తెలుసుకునేందుకు రీటా కుమారుడు ప్రయత్నించాడు. అయితే ఆమె బ్యాంకు ఖాతాలో రూ. 9,99,49,586 ఉన్నట్లు ఏటీఎం స్క్రీన్‌పై కనిపించింది.
మరోవైపు తన బ్యాంకు ఖాతాలో సుమారు పది కోట్లు ఉండటం చూసి రీటా, ఆమె కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. ఎవరికో సంబంధించిన ఈ డబ్బు తమకు వద్దని ఆమె తెలిపింది. బ్యాంకు తెరిచిన తర్వాత ఆ డబ్బు వెనక్కి తీసుకోవాలని కోరుతామని చెప్పింది. ఆమె కుమారుడు రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
అయితే ఆ బ్యాంకు అధికారి దీనిపై స్పందించారు. ఆ మహిళకు రుణ ఖాతా ఉన్నదని తెలిపారు. సాంకేతిక సమస్య వల్ల ఆమె బ్యాంకు ఖాతాలో ఈ మొత్తం చూపించిందని చెప్పారు. ఈ లోపాన్ని సరిదిద్దేందుకు ప్రయత్నిస్తుండగానే వారు ఈ విషయాన్ని వైరల్ చేసినట్లు బ్యాంకు అధికారి ఆరోపించారు.
#मैनपुरी में एक महिला के बैंक खाते में अचानक लगभग 10 करोड़ रुपये आने का मामला सामने आया है
बताया जा रहा है कि बिछवा थाना क्षेत्र की रहने वाली महिला का खाता सुल्तानगंज स्थित Bank of India की शाखा में है
महिला को जब खाते में बड़ी रकम आने का मैसेज मिला तो वह हैरान रह गई और एटीएम… pic.twitter.com/6wzG5XXiy8
— Barabanki_updates_ (@BBK_Update) March 27, 2026
Also Read:
Man Beheads Ice-Cream Seller | ఐస్‌క్రీం వ్యాపారి తల నరికిన వ్యక్తి.. తెగిన తలను ఇంటికి తీసుకెళ్లాడు
Watch: శోభాయాత్ర సందర్భంగా.. గాలిలోకి కాల్పులు జరిపిన బీజేపీ ఎమ్మెల్యే
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

