Man Beheads Ice-Cream Seller | ఐస్క్రీం వ్యాపారి తల నరికిన వ్యక్తి.. తెగిన తలను ఇంటికి తీసుకెళ్లాడు
Man Beheads Ice-Cream Seller | ఐస్క్రీం వ్యాపారి, ఒక వ్యక్తి మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో అతడి తల నరికాడు. తెగిన ఐస్క్రీం వ్యాపారి తలను ఇంటికి తీసుకెళ్లాడు. తాపీగా వంట చేసుకోసాగాడు. ఇది చూసి పోలీసులు షాక్ అయ్యారు.
లక్నో: ఐస్క్రీం వ్యాపారి, ఒక వ్యక్తి మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో అతడి తల నరికాడు. తెగిన ఐస్క్రీం వ్యాపారి తలను ఇంటికి తీసుకెళ్లాడు. తాపీగా వంట చేసుకోసాగాడు. ఇది చూసి పోలీసులు షాక్ అయ్యారు. (Man Beheads Ice-Cream Seller) ఉత్తరప్రదేశ్లోని బారాబంకీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 25 ఏళ్ల ఐస్క్రీం విక్రేత బబ్లూ వాటిని అమ్మేందుకు శనివారం యథావిధిగా సైకిల్పై పర్సవాల్ గ్రామానికి వెళ్లాడు. స్థానికుడైన 50 ఏళ్ల శంకర్ యాదవ్, అతడి మధ్య వాగ్వాదం జరిగింది.
కాగా, ఆగ్రహించిన శంకర్ యాదవ్, ఐస్క్రీమ్ అమ్మే బబ్లూపై కొడవలితో దాడి చేశాడు. అందరూ చూస్తుండగా అతడి గొంతు కోసి తల వేరు చేశాడు. ఆ తర్వాత నరికిన బబ్లూ తలను చేతిలో పట్టుకుని తన ఇంటికి తీసుకెళ్లాడు. తాపీగా వంట చేసుకోవడం ప్రారంభించాడు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఐస్క్రీమ్ అమ్మే బబ్లూను హత్య చేసిన శంకర్ యాదవ్ ఇంటిని వారు చుట్టుముట్టారు. పోలీసులు ఇంటి లోపలకు వెళ్లి చూడగా నిందితుడు వంట చేస్తూ కనిపించాడు. అతడి పక్కనే నరికిన బబ్లూ తల ఉన్నది.
పోలీసులు వెంటనే శంకర్ యాదవ్ను అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. బబ్లూ మృతదేహం, తెగిన తలను పోస్ట్మార్టం కోసం తరలించారు. ఈ హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హతుడు బాబ్లూకు భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
➡️आईसक्रीम बेचने गए 21 वर्षीय युवक बबलू की निर्मम हत्या,
➡️गाँव में शंकर यादव ने कहासूनी के बाद बाँके से गला काटकर बबलू की कर दी निर्मम हत्या,
➡️हत्या से क्षेत्र में दहशत,
➡️टिकैत नगर थाना क्षेत्र के परसावल गांव का पूरा मामला !#Barabanki @Barabankipolice @Uppolice pic.twitter.com/hUsyQmGRWm— Hindustan Express | हिन्दुस्तान एक्सप्रेस (@Hindustan_Expr) March 28, 2026
Also Read:
Watch: శోభాయాత్ర సందర్భంగా.. గాలిలోకి కాల్పులు జరిపిన బీజేపీ ఎమ్మెల్యే
Watch: జీతం చెల్లించలేదని.. యజమాని కారును ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన డంపర్ డ్రైవర్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

