Superstar Rajinikanth | సూపర్ స్టార్ రజనీకాంత్ (Superstar Rajinikanth) హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ధర్మన్’ (Dharman). ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభమైనట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా ఒక వీడియోను విడుదల చేసింది. ‘ఓ మై కడవులే’, ‘డ్రాగన్’ వంటి వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు అశ్వత్ మారిముత్తు (Ashwath Marimuthu) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) తన సొంత నిర్మాణ సంస్థ అయిన ‘రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ (RKFI) బ్యానర్‌పై ఈ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో రజనీకాంత్ సరసన సిమ్రాన్ (Simran), రాశీ ఖన్నా (Raashi Khanna) హీరోయిన్లుగా నటిస్తుండగా, కమెడియన్ యోగి బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) సంగీతం అందిస్తున్నారు. ఇక ఇదివరకే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లో రజనీకాంత్ రక్తంతో తడిసిన సర్జికల్ టూల్ పట్టుకుని ‘ది డెడ్లీ డాక్టర్’ (The Deadly Doctor) ట్యాగ్‌లైన్‌తో కనిపించి ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేశారు. ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న ఈ రెండో షెడ్యూల్‌తో సినిమాపై మరింత హైప్ క్రియేట్ అవుతోంది.