Watch: జీతం చెల్లించలేదని.. యజమాని కారును ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన డంపర్ డ్రైవర్
Dumper driver rams into employer's car | యజమాని జీతం చెల్లించకపోవడంతో డంపర్ డ్రైవర్ ఆగ్రహించాడు. యజమాని కారును డంపర్తో ఢీకొట్టి కొంతదూరం ఈడ్చుకెళ్లాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ముంబై: యజమాని జీతం చెల్లించకపోవడంతో డంపర్ డ్రైవర్ ఆగ్రహించాడు. యజమాని కారును డంపర్తో ఢీకొట్టి కొంతదూరం ఈడ్చుకెళ్లాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Dumper driver rams into employer’s car) మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. డోంబివ్లి ప్రాంతానికి చెందిన వ్యక్తికి పలు డంపర్ లారీలున్నాయి. అయితే యజమాని వేతనం చెల్లించకపోవడంతో డ్రైవర్ సత్యం ఆగ్రహించాడు. నిలిచి ఉన్న యజమాని కారును డంపర్తో ఢీకొట్టాడు. కొంతదూరం వరకు ముందుకు తోసుకెళ్లాడు. ఆగి ఉన్న మరో డంపర్ మధ్య నలిగిన ఆ కారు ధ్వంసమైంది. ఆ కారులో ఎవరూ లేకపోవడంతో ఎవరికీ ఏమీ కాలేదు.
కాగా, పెద్ద శబ్దం రావడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. సంఘటనా స్థలానికి వారు చేరుకున్నారు. యజమాని కారును డంపర్ డ్రైవర్ ధ్వంసం చేసినట్లు తెలుసుకున్నారు. కారు యజమాని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
మరోవైపు ఆ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. యజమాని జీతాలు చెల్లించకపోవడమే దీనికి కారణమని పోలీసులు తెలుసుకున్నారు. ఒక వ్యక్తి మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
काफ़ी समय से वेतन न मिलने से नाराज डम्फर चालक ने मालिक की कार को टक्कर मारते हुए काफ़ी दूर तक लेकर गया pic.twitter.com/E6uQ5kWUg1
— अनुज यदुवंशी (@Anujyadava2y) March 28, 2026
Also Read:
Watch: స్కూటీని రాసుకుని వెళ్లినందుకు.. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ను ధ్వంసం చేసిన మహిళ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
Girl | ఈ యువతి కారుపై ఎక్కి ఏం చేస్తుందో చూడండి.. వీడియో
Music Director Deva | చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
Mahela Jayawardene | హెడ్ కోచ్ జయవర్ధనేతో బంధానికి తెర.. కొత్త హెడ్కోచ్ కోసం ముంబై ఇండియన్స్ కసరత్తు..!
Blue Drum Case | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితురాలికి మరణశిక్ష.. 10 నెలల కూతురు పరిస్థితి ఏంటి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

