ముంబై: ప్రియుడితో పెళ్లికి నిరాకరించిన తండ్రైన పోలీస్ అధికారిని పోలీస్ కుమార్తె హత్య చేసింది. ఆ తర్వాత పోలీస్ వ్యక్తిని పెళ్లాడింది. అయితే మూడేళ్లకే వారి వివాహ బంధం బీటలు వారింది. (Police woman Poisoned Cop Father) ఈ నేపథ్యంలో పోలీస్ భర్త అసలు గుట్టును రట్టు చేశాడు. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 45 ఏళ్ల జయంత్ బల్లావర్ పోలీస్ అధికారి. పోలీస్ అయిన ఆయన కుమార్తె ఆర్య, పోలీస్ శిక్షణ పొందుతున్న ఆశిష్ ప్రేమించుకున్నారు. అయితే వీరిద్దరి సంబంధాన్ని తండ్రి జయంత్ నిరాకరించాడు. ఈ నేపథ్యంలో ఆయన అడ్డు తొలగించుకునేందుకు వారిద్దరూ కలిసి కుట్ర పన్నారు.
కాగా, 2023 ఏప్రిల్ 25న పోలీస్ అధికారి జయంత్ డ్యూటీకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. పోలీస్ అయిన కుమార్తె ఆర్య, విషం కలిపిన మిల్క్‌షేక్ ఆయనకు ఇచ్చింది. అది తాగిన జయంత్, చంద్రపూర్‌లోని జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ కళ్లు తిరగడంతో కుప్పకూలి మరణించారు. అయితే అనారోగ్యం వల్ల ఆయన ఆకస్మికంగా చనిపోయినట్లు పోలీస్ అధికారులు భావించారు. జయంత్ మృతిపై ఎవరికీ అనుమానం కలుగకపోవడంతో ఈ కేసును మూసివేశారు.
మరోవైపు తండ్రి మరణం తర్వాత ఆర్య, ఆశిష్ పెళ్లి చేసుకున్నారు. అయితే వారి బంధం ఎంతో కాలం నిలువలేదు. క్రమశిక్షణారాహిత్యం, దుష్ప్రవర్తన కారణంగా పోలీస్ శిక్షణ నుంచి ఆశిష్‌ను తొలగించారు. ఆర్య తన పుట్టింటిలోనే నివసించడంతో భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువయ్యాయి.
అయితే ఈ పరిణామాల నేపథ్యంలో గత వారం ఆశిష్ స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. మూడేళ్ల కిందట తన భార్య విషం కలిపిన మిల్క్‌షేక్ ఇచ్చి పోలీస్ అధికారి అయిన తండ్రిని హత్య చేసిందని ఆరోపించాడు. తమ పెళ్లి కోసం ఆమె ఈ కుట్రకు పాల్పడిందని, బంధువు ద్వారా విషం కొనుగోలు చేసిందని చెప్పాడు.
కాగా, ఇది తెలుసుకుని పోలీసులు షాక్ అయ్యారు. ఆశిష్ ఆరోపణలపై దర్యాప్తు చేయగా అది నిజమని తేలింది. ఈ నేపథ్యంలో భార్యాభర్తలైన ఆర్య, ఆశిష్‌తో పాటు ఆమె కజిన్ అయిన 22 ఏళ్ల చైతన్య, విష పదార్థం సరఫరా చేసిన మరో వ్యక్తితో సహా నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Tamil Nadu Assembly polls | 164 స్థానాల్లో డీఎంకే పోటీ.. మిత్రపక్షాలకు 70 స్థానాలు