IPL 2026 : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్ ఆరంభ పోరు మరికొన్ని గంటల్లో మొదలవ్వనుంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు ఆతిథ్య రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru)ను సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) ఢీ కొట్టనుంది. అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్ లో ఇరుజట్లు విజయంపై కన్నేయగా.. రికార్డులు మాత్రం ఆరెంజ్ ఆర్మీ తడబాటును గుర్తు చేస్తున్నాయి. గత ఐదు సీజన్లలో సన్‌రైజర్స్‌కు ఆరంభ పోరు అచ్చిరావడం లేదు. ఏకంగా నాలుగు మ్యాచుల్లో హైదరాబాద్ జట్టు ఓటమి పాలైంది.
ఐపీఎల్ చరిత్రలో రికార్డు స్కోర్ కొట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ సీజన్ సీజన్‌కు రాటుదేలుతోంది. వైల్డ్ ఫైర్ ఆటతో ప్రత్యర్ధుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించే ఆరెంజ్ ఆర్మీని ఒక బలహీనత వెంటాడుతోంది. ఐపీఎల్ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ జట్టు చతికిలపడుతోంది. పద్దెనిమిదో ఎడిషన్‌లో విజయం మినహా.. అంతకుముందరి నాలుగు సీజన్లలోనూ ఓపెనింగ్ మ్యాచ్‌లో ఓటమే ఎదురైంది.
Who will get the W tonight? #IPL2026 pic.twitter.com/yJMF9N0YV0
— ESPNcricinfo (@ESPNcricinfo) March 28, 2026
మరోవైపు బెంగళూరు జట్టుది కూడా దాదాపు అదే కథ. ఐదు సీజన్లలోలో ఆ జట్టు మూడేసి విజయాలు, రెండు ఓటములతో హైదరాబాద్ కంటే మెరుగ్గానే ఉంది. ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఆడుతున్న ఆర్సీబీకి చెక్ పెట్టాలంటే ఇషాన్ కిషన్ సేన వైల్డ్ ఫైర్ ఆటతో రెచ్చిపోవాలి.
ఐపీఎల్ 2021 – ఆరంభ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడింది. అయితే.. ఈ మ్యాచ్‌లో ప్రత్యర్ధి నిర్దేశించిన 188 పరుగుల ఛేదనలో 177కే పరిమితమైంది. ఉత్కంఠ పోరులో ఆరెంజ్ ఆర్మీ10 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది.
ఐపీఎల్ 2022 – ఈసారి రాజస్థాన్ రాయల్స్ దెబ్బకు సన్‌రైజర్స్ తలొంచింది. జోస్ బట్లర్, సంజూ శాంసన్ విధ్వంసంతో 210/6తో సన్‌రైజర్స్‌కు సవాల్ విసిరింది రాజస్థాన్. భారీ ఛేదనలో టాపార్డర్ తేలిపోగా 61 పరుగుల ఓటమి తప్పలేదు.

ఐపీఎల్ 2023 – వరుసగా రెండోసారి ఆరంభ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ కంగుతిన్నది. 204 పరుగుల ఛేదనలో 131కే పరిమితమైన హైదరాబాద్ 72 పరుగుల తేడాతో చతికిలపడింది.
ఐపీఎల్ 2024 – ఆరంభ పోరులో హ్యాట్రిక్ ఓటములకు బ్రేక్ వేయాలనుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆశలపై కోల్‌కతా నైట్ రైడర్స్ నీళ్లు చల్లింది. ప్రత్యర్ధికి 203 పరుగులు సమర్పించుకున్న హైదరాబాద్ చివరిదాకా పోరాడింది. మ్యాచ్‌ను ఆఖరి ఓవర్ వరకూ తీసుకెళ్లినా.. 4 పరుగుల తేడాతో ఓటమే ఎదురైంది.
🚨 ₹1000 FINE TO CAPTAIN – ISHAN KISHAN’S CRAZY JOURNEY.🚨
– Ishan once got a ₹1000 fine for indiscipline, but now he has become SRH temporary captain in IPL 2026.
His journey shows how he learned from mistakes and grew into a leader.(Express Sports)pic.twitter.com/YW6MOZFRUN
— Sam (@Cricsam01) March 21, 2026
ఐపీఎల్ 205 – పద్దెనిమిదో సీజన్ ఆరంభ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్(Ishan Kishan) సెంచరీతో గర్జించాడు. ఉప్పల్ స్టేడియంలో ఇషాన్ మెరుపపులతో రాజస్థాన్ రాయల్స్‌పై 44 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ బోణీ కొట్టింది. భారీ విజయంతో గత నాలుగు సీజన్ల ఓపెనింగ్ మ్యాచుల్లో ఎదురైన పరాజయాలకు ముంగిపు పలికింది.