Danam Nagender | పార్టీ ఫిరాయింపు కేసులో తనను అనర్హుడిగా ప్రకటిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని కోరుతూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయగా.. దానం నాగేందర్‌పై అనర్హత వేసిన సుప్రీంకోర్టు.. మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. దీంతో ఖైరతాబాద్ ఎన్నిక అనివార్యం కానుంది.
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో దానం నాగేందర్ మీడియాతో మాట్లాడుతూ.. నేను సుప్రీంకోర్టు తీర్పును ముందే ఊహించానన్నారు. తర్వాతి పరిణామాలు ఇలా ఉంటాయని కూడా నాకు ఐడియా ఉంది. అయినప్పటికీ టెన్త్ షెడ్యూల్ ప్రకారం మాకు ఊరట దొరుకుతదనుకున్నాం. తీర్పును కూడా మేం తప్పుబట్టడం లేదన్నారు.. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తూ రాబోయే రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడొచ్చినా కూడా ప్రజల మధ్యనే ఉండి ఎన్నికలకు సిద్ధం అవుతానని స్పష్టం చేశారు.
ప్రజా సంక్షేమమే మా సంక్షేమంగా భావించి.. నిరంతరం ప్రజల మధ్య ఉండి ప్రజల బాగోగుల విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మరి అభివృద్ధి విషయంలో కానీ, ప్రజల సమస్యల విషయంలో కానీ నిరంతరం పోరాడుతూ వచ్చాం..కాబట్టి మళ్లీ ప్రజల వద్దకు పోయి ప్రజల ఆశీస్సులు తీసుకొని మళ్లీ శాసనసభకు పోటీ చేస్తామన్నారు. అయితే మళ్లీ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారని రిపోర్టర్ ప్రశ్నించగా.. అప్పుడు టికెట్ వచ్చినంక చెప్తా. ఇప్పుడేం చెప్పాలంటూ దాటవేశారు.
ఎన్నికల సమయంలో నేను ఏ పార్టీ నుండి పోటీ చేస్తానో చెప్తాను
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాను
నన్ను ప్రజాక్షేత్రంలో తిరిగి పోటీ చేయమని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది
ఎన్నికల షెడ్యూల్‌కు సిద్ధంగా ఉన్నాను
– దానం నాగేందర్ https://t.co/MzzaPUqGbK pic.twitter.com/x5qvFiDc9t
— Telugu Scribe (@TeluguScribe) September 24, 2026
President Murmu | కాంస్యం గెలిచిన భారత మెన్స్ బ్యాడ్మింటన్ జట్టుకు రాష్ట్రపతి అభినందనలు..!
Ganesh immersion | గణేశుడి నిమజ్జనానికి వెళ్లి.. వ్యక్తి మృతి
Ranbir Kapoor | ‘లవ్ అండ్ వార్’ విడుదల తేదీ ఖరారు.. సరికొత్త లుక్‌లో రణ్‌బీర్ కపూర్!