President Murmu | కాంస్యం గెలిచిన భారత మెన్స్ బ్యాడ్మింటన్ జట్టుకు రాష్ట్రపతి అభినందనలు..!
President Murmu | ఆసియా క్రీడల (Asian Games) లో కాంస్య పతకం (Bronze Medal) గెలిచిన భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు (Mens Badminton Team) కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) అభినందనలు తెలియజేశారు. ఈ విజయం జట్టు దృఢ సంకల్పానికి నిదర్శనమని అన్నారు.
President Murmu : ఆసియా క్రీడల (Asian Games) లో కాంస్య పతకం (Bronze Medal) గెలిచిన భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు (Mens Badminton Team) కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) అభినందనలు తెలియజేశారు. ఈ విజయం జట్టు దృఢ సంకల్పానికి నిదర్శనమని అన్నారు. ఈ విజయం జట్టు పట్టుదల, పోరాట పటిమను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. జపాన్ (Japan) లోని ఐచిలో బుధవారం జరిగిన సెమీ-ఫైనల్ మ్యాచ్ (Semifinal Match) లో చైనా (China) చేతిలో 3-1 తేడాతో ఓటమి చవిచూసినప్పటికీ, భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.
ఈ క్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పురుషుల బ్యాడ్మింటన్ జట్టుకు అభినందనలు తెలియజేశారు. ఆమె ‘X’ వేదికగా స్పందిస్తూ.. ‘ఆసియా క్రీడలలో కాంస్య పతకం సాధించిన భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టుకు హృదయపూర్వక అభినందనలు. ఈ అద్భుతమైన విజయం జట్టు దృఢ సంకల్పం, పట్టుదల, పోరాట పటిమను ప్రతిబింబిస్తుంది. ఈ గర్వించదగ్గ విజయంలో ప్రతి సభ్యుడు విలువైన కృషిచేశారు. భవిష్యత్తులో జట్టు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా’ అని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

