Huzurabad | సగరుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి
సగరుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సగర సంఘం నాయకులు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కోరారు. ఈ మేరకు తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కోశాధికారి కానిగంటి శ్రీనివాస్ సగర, ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు దేవునూరి శ్రీనివాసు సగర, జిల్లా ప్రధాన కార్యదర్శి కట్ట రాజు సగర, జిల్లా కోశాధికారి కాటిపెల్లి కుమారస్వామి సగర ఆధ్వర్యంలో సగరులు కౌశిక్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు.
- హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కోరిన కరీంనగర్ సగర సంఘం నాయకులు
Huzurabad | హుజురాబాద్ : సగరుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సగర సంఘం నాయకులు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కోరారు. ఈ మేరకు తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కోశాధికారి కానిగంటి శ్రీనివాస్ సగర, ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు దేవునూరి శ్రీనివాసు సగర, జిల్లా ప్రధాన కార్యదర్శి కట్ట రాజు సగర, జిల్లా కోశాధికారి కాటిపెల్లి కుమారస్వామి సగర ఆధ్వర్యంలో సగరులు కౌశిక్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. సగరులను బీసీ డీ నుండి బీసీ ఏ లోకి మార్చాలని, గీత కార్మికుల మాదిరి 50 సంవత్సరాలకే ఫించన్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. అలాగే సగర ఫెడరేషన్‌ను పూర్తిస్థాయి సంక్షేమ కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ కాంట్రాక్టు పనుల్లో సగర లేబర్ కో-ఆపరేటివ్ సొసైటీలకు ప్రాధాన్యత కల్పించడంతో పాటు, ఈఎండీ మినహాయింపు ఇవ్వాలని కోరారు.నిర్మాణ రంగంలో పనిచేస్తున్న సగర కార్మికులకు ప్రత్యేక ఆరోగ్య భద్రత, ప్రమాద బీమా, పెన్షన్ సౌకర్యాలు కల్పించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.
సగరుల ఆరాధ్య దైవమైన భగీరథ మహర్షి విగ్రహాన్ని హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని, జహీరాబాద్ నియోజకవర్గ కేంద్రంలో సగర కమ్యూనిటీ భవనం, విద్యార్థుల కోసం వసతిగృహ నిర్మాణానికి ప్రభుత్వ స్థలం, అవసరమైన నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. సగరుల సమస్యలను రాబోయే శాసనసభ సమావేశాల్లో ప్రస్తావించి, ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని ఆ సంఘం నాయకులు కోరారు. అలాగే సగర (ఉప్పర) సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి, సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని నిలదీయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో సగర సంఘం నాయకులు గుంటి శ్రీనివాస్ సగర్, నలుబాల వేణుగోపాల్ సగర, గుంటి అశోక్ సగర, కుర్మిండ్ల రాజు సగర, యంజాల వాసు సగర, దేవునూరి రాజేందర్ సగర, కుర్మిండ్ల మల్లయ్య సగర, సట్లపల్లి నగేష్ సగర, నలుబాల మధు సగర, అనిశెట్టి సతీష్ సగర, అనిశెట్టి సాంబశివ సగర, నలుబాల రాము సగర, దొనికెన చంద్రమౌళి, కానిగంటి కిరణ్, కానిగంటి శ్రీనివాస్, కురిమిండ్ల సుదర్శన్, కురిమిండ్ల సంతోష్, కొల్లూరి సాంబయ్య, కొల్లూరి మధు తదితర సగర సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- BRS
- huzurabad
- Karimnagar
- Katta Raju
RELATED ARTICLES
తాజా వార్తలు
Huzurabad | సగరుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి
Karan Johar | సోషల్ మీడియా అల్గారిథమ్ నా మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది: కరణ్ జోహార్
Phule Movie | సామాజిక విప్లవకారుల స్ఫూర్తిదాయక గాథ.. నవంబర్ 27న తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘ఫూలే’!
Air Pollution | గాలి కాలుష్యం వల్ల కూడా గుండె జబ్బులు, మధుమేహం.. జాగ్రత్తలు పాటించాలంటున్న నిపుణులు..
Harish Rao | ఆనాడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆదేశాలు వచ్చేలా చేసింది కేసీఆర్.. రేవంత్ మాటలపై హరీశ్ రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

