Air Pollution | గాలి కాలుష్యం వల్ల కూడా గుండె జబ్బులు, మధుమేహం.. జాగ్రత్తలు పాటించాలంటున్న నిపుణులు..
దేశంలో గుండె జబ్బులు, మధుమేహం, ఊపిరితిత్తుల వ్యాధులు వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నివారణ గురించి చర్చించినప్పుడు ఉప్పు, చక్కెర, పొగాకు వినియోగం, వ్యాయామం వంటి అంశాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే ప్రతి ఒక్కరూ పీల్చే కలుషిత గాలి ప్రభావాన్ని మాత్రం ఆరోగ్య కార్యక్రమాల్లో తగినంతగా పరిగణించడం లేదు.
Air Pollution | దేశంలో గుండె జబ్బులు, మధుమేహం, ఊపిరితిత్తుల వ్యాధులు వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నివారణ గురించి చర్చించినప్పుడు ఉప్పు, చక్కెర, పొగాకు వినియోగం, వ్యాయామం వంటి అంశాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే ప్రతి ఒక్కరూ పీల్చే కలుషిత గాలి ప్రభావాన్ని మాత్రం ఆరోగ్య కార్యక్రమాల్లో తగినంతగా పరిగణించడం లేదు. గాలిలో ఉండే అతి సూక్ష్మ ధూళికణాలు శరీరంలోకి ప్రవేశించి రక్తనాళాల్లో వాపును పెంచుతాయి. ధమనులను గట్టిపరచడం, రక్తపోటును పెంచడం, ఇన్సులిన్ పనితీరును దెబ్బతీయడం వంటి ప్రభావాలు చూపుతాయి. వీటి కారణంగా పక్షవాతం, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధులు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. పొగతాగని వారిలోనూ ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ఇవి కారణమవుతాయి.
కాలుష్యం కారణంగా అనేక మరణాలు..
2025లో ప్రచురితమైన లాన్సెట్ ఆరోగ్య, వాతావరణ మార్పుల నివేదిక ప్రకారం.. 2022లో భారత్‌లో పీఎం2.5 కాలుష్యం కారణంగా సుమారు 17.2 లక్షల మంది మరణించారు. 2010తో పోలిస్తే ఈ సంఖ్య 38 శాతం పెరిగింది. పది నగరాల్లో 2008 నుంచి 2019 వరకు జరిగిన మరణాలను పరిశీలించిన 2024 అధ్యయనం ప్రకారం, ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన పరిమితికి మించిన కాలుష్యం కారణంగా మొత్తం మరణాల్లో 7.2 శాతం సంభవించాయి. ఢిల్లీలో ఈ వాటా అత్యధికంగా 11.5 శాతంగా నమోదైంది. పీఎం2.5 స్థాయిలో ప్రతి 10 మైక్రోగ్రాముల పెరుగుదలతో రోజువారీ మరణాల సంఖ్య 1.4 శాతం పెరిగింది. కాలుష్యం అనుమతించిన పరిమితుల్లో ఉన్న రోజుల్లో కూడా మరణాల ప్రమాదం పెరుగుతున్నట్లు పరిశోధన వెల్లడించింది. వాయు కాలుష్యం వల్ల 2022లో భారత్‌కు సుమారు 339.4 బిలియన్ డాలర్ల ఆదాయ నష్టం వాటిల్లింది.
ప్రభుత్వాలు ఏం చేయాలి..?
ఈ సమస్యను తగ్గించేందుకు ఆరోగ్య విధానాల్లో మార్పులు అవసరం. ఆరోగ్య కేంద్రాల్లో రక్తపోటు, మధుమేహం పరీక్షలతో పాటు ప్రజలు ఉపయోగించే వంట ఇంధనం, ప్రయాణించే మార్గాలు, భారీ వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నివాసం వంటి వివరాలను కూడా సేకరించాలి. అధిక కాలుష్యం ఉన్న రోజుల్లో మాస్కుల వినియోగం, ఇంటి లోపలి గాలి నాణ్యత, వ్యాయామం చేసే సమయం గురించి సూచనలు ఇవ్వాలి. ప్రస్తుతం భారత్ నిర్దేశించిన రోజువారీ పీఎం2.5 పరిమితి 60 మైక్రోగ్రాములు కాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన పరిమితి 15 మైక్రోగ్రాములుగా ఉంది. ఈ స్థాయికి చేరుకునేలా దశలవారీగా చర్యలు చేపట్టాలి. ఆసుపత్రులు రోజువారీ గాలి నాణ్యత సూచీతోపాటు గుండె, శ్వాసకోశ సమస్యలతో చేరుతున్న రోగుల వివరాలను కూడా వెల్లడించాలి.
కాలుష్యాన్ని ఎలా తగ్గించాలి..?
నగరాల్లో ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచడం, చెత్తను బహిరంగంగా కాల్చకుండా చూడడం, నిర్మాణ ప్రాంతాల్లో ధూళిని నియంత్రించడం, డీజిల్ జనరేటర్ల వినియోగాన్ని తగ్గించడం వంటి చర్యలు చేపట్టాలి. గ్రామీణ ప్రాంతాల్లో కట్టెల పొయ్యిల నుంచి వెలువడే పొగ మహిళలు, పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందువల్ల స్వచ్ఛమైన వంట ఇంధన పథకాలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలి. కాలుష్య నియంత్రణకు చేసే ఖర్చును ఆరోగ్య రంగ పెట్టుబడిగానే చూడాలి. వ్యక్తిగత జీవనశైలి మార్పులతోపాటు ప్రతి ఒక్కరికీ స్వచ్ఛమైన గాలి అందేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నప్పుడే గుండె, ఊపిరితిత్తుల వ్యాధులను తగ్గించి ప్రజల ఆరోగ్యాన్ని, జీవనోపాధిని కాపాడగలుగుతాయి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Air Pollution | గాలి కాలుష్యం వల్ల కూడా గుండె జబ్బులు, మధుమేహం.. జాగ్రత్తలు పాటించాలంటున్న నిపుణులు..
Harish Rao | ఆనాడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆదేశాలు వచ్చేలా చేసింది కేసీఆర్.. రేవంత్ మాటలపై హరీశ్ రావు ఫైర్
పుట్టపాక వాసి విజయ్‌కుమార్‌కు గణిత శాస్త్రంలో జేఎన్టీయూ డాక్టరేట్
Hey Kannamma | యశ్ మాస్టర్, ధనశ్రీ వర్మ జోడిగా ‘హే కన్నమ్మ’.. ఆకట్టుకుంటున్న ట్రైలర్!
Septic tank | బాచుపల్లిలో విషాదం..సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తూ ముగ్గురుయువులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

