Harish Rao | ఆనాడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆదేశాలు వచ్చేలా చేసింది కేసీఆర్.. రేవంత్ మాటలపై హరీశ్ రావు ఫైర్
Harish Rao | జగన్మోహన్ రెడ్డి రాగానే కేసీఆర్ ఒప్పుకున్నడు.. పరమాన్నం తిన్నడు.. మాట్లాడిండు.. ఆంధ్రాకు మంచోడు.. అని సీఎం రేవంత్ రెడ్డి ఇంత పచ్చి అబద్దాలు మాట్లాడొచ్చా అని హరీశ్ రావు ప్రశ్నించారు.
Harish Rao | రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నేనే ఆపేశానని సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నాడని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నా మాటకు విలువ ఇచ్చి చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపేశాడని రేవంత్ రెడ్డి చెప్పాడు. రేవంత్ రెడ్డి మాటలు తప్పు అని నిరూపిస్తూ, ఆ ప్రాజెక్టు జగన్ హయాంలో బీఆర్ఎస్ రాసిన లేఖల వల్ల ఆగిపోయిందని చంద్రబాబు నాయుడు ప్రెస్ రిలీజ్ చేశాడని క్లారిటీ ఇచ్చారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 జూన్ లో వచ్చిండు.. వచ్చిపోగానే 5-5-2020లో రాయలసీమ లిఫ్ట్ జీవో వచ్చింది.. నిజమేంటో చెబుతా..అసలు ఈ జీవో రాకముందే ఉత్తరం రాసినం.. జీవో మేలో వచ్చింది.. మా బీఆర్ ఎస్ కమిట్మెంట్, నిజాయితీకి ఇదొక నిదర్శనం.. ఈ లెటర్ 29-01-2020న రాసినం.. ఇందులో మీరు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చేపట్టబోతున్నట్టు సాక్షి, ఆంధ్రజ్యోతి, వెలుగుతోపాటు పలు వార్తా పత్రికల్లో వార్తలు వచ్చినయి.. అని ఆ వార్తల ఆధారంగా కేఆర్ ఎంబీకి 4 నెలల ముందే ఇలాంటి ప్రాజెక్ట్ ఏదైనా వస్తే వెంటనే ఆపండి.. దీనికి అనుమతులు ఇయ్యొద్దు.. వాళ్లు పనులు చేయకుండా మీరు వెంటనే ఆదేశాలు ఇవ్వండి.. అని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్‌కు జీవో రావడానికి 4 నెలల ముందు లేఖ రాశాం.. రేవంత్‌రెడ్డి ఏం మాట్లాడుతడు.. 2019 జూన్‌లో జగన్మోహన్ రెడ్డి రాగానే కేసీఆర్ ఒప్పుకున్నడు.. పరమాన్నం తిన్నడు.. మాట్లాడిండు.. ఆంధ్రాకు మంచోడు.. అని సీఎం రేవంత్ రెడ్డి ఇంత పచ్చి అబద్దాలు మాట్లాడొచ్చా అని హరీశ్ రావు ప్రశ్నించారు.
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వెంటనే ఆపాలని జగన్ మోహన్ రెడ్డికి కేసీఆర్ స్పష్టంగా చెప్పారు. చెప్పడమే కాకుండా KRMB నుండి ఆనాడు జగన్ ప్రభుత్వానికి ప్రాజెక్టు ఆపాలని అని హరీశ్ రావు స్పష్టం చేశారు.
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నేనే ఆపేశానని రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నాడు
నా మాటకు విలువ ఇచ్చి చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపేశాడని రేవంత్ రెడ్డి చెప్పాడు
రేవంత్ రెడ్డి మాటలు తప్పు అని నిరూపిస్తూ, ఆ ప్రాజెక్టు జగన్ హయాంలో బీఆర్ఎస్ రాసిన లేఖల వల్ల ఆగిపోయిందని చంద్రబాబు నాయుడు ప్రెస్ రిలీజ్ చేశాడు
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వెంటనే ఆపాలని జగన్ మోహన్ రెడ్డికి కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పారు
చెప్పడమే కాకుండా KRMB నుండి ఆనాడు జగన్ ప్రభుత్వానికి ప్రాజెక్టు ఆపాలని ఆదేశాలు వచ్చేలా చేసింది కేసీఆర్
– హరీష్ రావు
— Telugu Scribe (@TeluguScribe) November 24, 2026
Read Also :
రాయరావుపేటలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై వివాదం.. కలెక్టర్‌కు గ్రామస్తుల ఫిర్యాదు
Septic tank | బాచుపల్లిలో విషాదం..సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తూ ముగ్గురుయువులు మృతి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఆనాడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆదేశాలు వచ్చేలా చేసింది కేసీఆర్.. రేవంత్ మాటలపై హరీశ్ రావు ఫైర్
పుట్టపాక వాసి విజయ్‌కుమార్‌కు గణిత శాస్త్రంలో జేఎన్టీయూ డాక్టరేట్
Hey Kannamma | యశ్ మాస్టర్, ధనశ్రీ వర్మ జోడిగా ‘హే కన్నమ్మ’.. ఆకట్టుకుంటున్న ట్రైలర్!
Septic tank | బాచుపల్లిలో విషాదం..సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తూ ముగ్గురుయువులు మృతి
16వ సారి రక్తదానం.. మరోసారి మానవత్వం చాటిన రవితేజ
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

