16వ సారి రక్తదానం.. మరోసారి మానవత్వం చాటిన రవితేజ
ఆపదలో ఉన్నామని తెలిస్తే చాలు.. నేనున్నానంటూ ఆపన్నహస్తం అందించేందుకు ముందుకొస్తాడు. రక్తం అవసరమంటే ప్రాంతం, ప్రదేశం, దూరం అనే తేడా చూడడు. తన సొంత ఖర్చులతో వెళ్లి రక్తదానం చేసి ఆపదలో ఉన్నవారికి ప్రాణదాతగా నిలుస్తున్నాడు.
రుద్రంపూర్, నవంబర్ 24 : ఆపదలో ఉన్నామని తెలిస్తే చాలు.. నేనున్నానంటూ ఆపన్నహస్తం అందించేందుకు ముందుకొస్తాడు. రక్తం అవసరమంటే ప్రాంతం, ప్రదేశం, దూరం అనే తేడా చూడడు. తన సొంత ఖర్చులతో వెళ్లి రక్తదానం చేసి ఆపదలో ఉన్నవారికి ప్రాణదాతగా నిలుస్తున్నాడు. రక్తదానం అంటే కేవలం రక్తాన్ని ఇవ్వడం కాదు.. ఓ మనిషికి మరో జన్మను ప్రసాదించడమని తన సేవా నిరతితో నిరూపిస్తున్నాడు చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీకి చెందిన ఎన్.డి.రవితేజ. వృత్తిరీత్యా ప్రైవేటు ఉద్యోగిగా పని చేస్తూనే సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నాడు బీఆర్ఎస్ పార్టీ చుంచుపల్లి మండల యువజన నాయకుడు రవితేజ. అరుదైన ఏబీ పాజిటివ్ రక్త గ్రూప్ కలిగిన ఆయన, ఇప్పటివరకు 16 సార్లు రక్తదానం చేసి ఎంతోమందికి ప్రాణదాతగా నిలిచారు.
మంగళవారం కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రిలో రహీం అనే వ్యక్తికి శస్త్ర చికిత్స నిమిత్తం ఏబీ పాజిటివ్ రక్తం అత్యవసరమని వైద్యులు తెలిపారు. దీంతో రహీం కుటుంబ సభ్యులు వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా రక్తదాతల కోసం అభ్యర్థించారు. ఈ విషయం విశ్వమాత మదర్ థెరిసా బ్లడ్ గ్రూప్ డోనర్స్ దృష్టికి రావడంతో, సంస్థ సభ్యులు వెంటనే రవితేజకు సమాచారం అందించారు. స్పందించిన ఆయన ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆస్పత్రికి చేరుకుని రక్తదానం చేసి రహీం కుటుంబంలో ఆశలు చిగురింపజేశారు. ఈ సందర్భంగా విశ్వమాత మదర్ తెరిసా బ్లడ్ గ్రూప్ డోనర్స్ అధ్యక్షుడు గూడెల్లి ముఖేష్ మహారాజ్ రవితేజ సేవలను అభినందించారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hey Kannamma | యశ్ మాస్టర్, ధనశ్రీ వర్మ జోడిగా ‘హే కన్నమ్మ’.. ఆకట్టుకుంటున్న ట్రైలర్!
Septic tank | బాచుపల్లిలో విషాదం..సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తూ ముగ్గురుయువులు మృతి
16వ సారి రక్తదానం.. మరోసారి మానవత్వం చాటిన రవితేజ
Chlorination gas leak | ఎన్టీఆర్ జిల్లాలో క్లోరినేషన్ గ్యాస్ లీక్.. భయాందోళనలో గ్రామస్థులు
UP Elections | వంద ఇవ్వలేం 26 సీట్లే ఇస్తాం.. యూపీలో కాంగ్రెస్, సమాజ్వాది పార్టీల మధ్య ఇంకా కొలిక్కిరాని చర్చలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

