Ganesh immersion | గణేశుడి నిమజ్జనానికి వెళ్లి.. వ్యక్తి మృతి
నవరాత్రి ఉత్సవాలు పూర్తి చేసుకున్న గణపయ్యను నిమజ్జనం చేస్తుండగా ప్రమాదవశాస్తూ నీట మునిగి వ్యక్తి మృతి చెందాడు.
వెల్దుర్తి, సెప్టెంబర్ 24 : నవరాత్రి ఉత్సవాలు పూర్తి చేసుకున్న గణపయ్యను నిమజ్జనం చేస్తుండగా ప్రమాదవశాస్తూ నీట మునిగి వ్యక్తి మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా మాసాయిపేట మండలం గోపాలకృష్ణ పురం గ్రామ శివారు హల్దీ ప్రాజెక్టు కాలువలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికులు తెలిసిన వివరాల ప్రకారం.. మాసాయిపేట గ్రామానికి చెందిన కాముండ్ల గణేష్ (38) గ్రామంలోని గణపతి విగ్రహాన్ని గురువారం తెల్లవారుజామున సుమారు మూడు గంటల ప్రాంతంలో ప్రాజెక్టు కాలువలో నిమజ్జనం చేస్తుండగా ప్రమాదవశాత్తు గణేష్ నీటిలో మునిగిపోయాడు.
గమనించిన తోటివారు గణేష్ కోసం వెతికిన ఆచూకీ లభించలేదు. గ్రామంలోకి వెళ్లి కుటుంబ సభ్యులు గ్రామస్తులకు సమాచారం అందించారు. గురువారం ఉదయం వరకు కూడా గణేష్ మృతదేహం లభించకపోవడంతో పలువురు ఈతగాళ్లు గణేష్ మృతదేహం కోసం వెతుకుతున్నారు. గణేష్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

