MLA Sunitha Lakshma Reddy | పిల్ల పుట్టిన తర్వాత కల్యాణ లక్ష్మి ఇస్తున్నారంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్లు నవ్వారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. అసెంబ్లీలో ఈ విషయమై సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. నా నియోజకవర్గంలో హత్నూర మండలానికి చెందిన మహేశ్వరి D/O గోపాల్. పెళ్లయింది 18-02 -2024.. అంటే రెండేళ్లు అయిపోయింది.. ఇంతవరకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ రాలేదు. ఇంకొకరికి బాబు పుట్టి మొదటి బర్త్ డే కూడా అయిపోయింది. అయినా కల్యాణ లక్ష్మి వస్తలేదు. నాగారం గ్రామానికి చెందిన మాధవికి కూడా రెండేళ్లు అయిపోతుంది.. ఇంతవరకు రాలేదన్నారు.
కౌశిక్ రెడ్డి కోర్టుకు వెళ్లినప్పుడు హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. ఎమ్మెల్యేతో చెక్కులు ఇవ్వాలని చెప్పినా.. మా నియోజకవర్గంలో మాత్రం నేను ప్రతిపక్ష ఎమ్మెల్యే అనేమో తెలియదు కానీ.. ఏ జిల్లాలో చూసినా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఇస్తున్నరు.. కానీ మా మెదక్ జిల్లాలో చూసుకుంటే మెదక్ ఎమ్మెల్యే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ, కొబ్బరికాయలు కొడుతున్నారు. కానీ నా నియోజకవర్గానికి వచ్చేసరికి ఇన్చార్జి మంత్రి వస్తేనే చెక్కులియ్యాలని.. ఇప్పటికీ ఆరు నెలలు అవుతుంది. నర్సాపూర్ నియోజకవర్గంలో చెక్కులు పంచలేదు. ఇదేం పద్దతి అని అడుగుతున్నా.. ఎవరైనా లబ్ధి దారులకు ఇచ్చేదే.. ప్రభుత్వం నుంచి ఒక డైరెక్షన్స్ ఇవ్వండి.. కల్యాణ లక్ష్మి కేసీఆర్ ఇచ్చిండు అని అంటున్నరే తప్ప కాంగ్రెస్ పార్టీ ఐతే ఇచ్చిందంటలేరని స్పష్టంగా తెలియజేస్తున్నరని అన్నారు.
పిల్ల పుట్టిన తర్వాత కల్యాణ లక్ష్మి ఇస్తున్నారంటే ఆరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నవ్వారు
నా నియోజకవర్గంలో పెళ్లి జరిగి రెండేళ్లయి, బాబు పుట్టి ఫస్ట్ బర్త్ డే కూడా అయింది అయినా ఇంతవరకు కల్యాణలక్ష్మి పడలేదు
ఇంకొకరికి కూడా పెళ్లయి రెండేళ్లయినా ఇంతవరకు కల్యాణలక్ష్మి రాలేదు
ఏ… https://t.co/0i0TipSKS8 pic.twitter.com/LlPsdbFYBW
— Telugu Scribe (@TeluguScribe) March 28, 2026
‘పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు వేయించాలి’
Mamata Banerjee | బెంగాల్‌ను టార్గెట్ చేస్తే.. కేంద్రంలో బీజేపీని గద్దె దించుతా : మమతాబెనర్జీ
Suicide | వ్యవసాయ విశ్వవిద్యాలయం అటవి ప్రాంతంలో ఒకరు ఆత్మహత్య