Prajwal Revanna | జైలులో ప్రజ్వల్ రేవణ్ణ సెల్ఫోన్లో 90 నీలి చిత్రాలు..! షాక్ అయిన అధికారులు
Prajwal Revanna | లైంగిక దాడి కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న జనతాదళ్ (సెక్యులర్) మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.
Prajwal Revanna | లైంగిక దాడి కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న జనతాదళ్ (సెక్యులర్) మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఆయన ఉన్న బ్యారక్ నుండి డజన్ల కొద్దీ అశ్లీల వీడియోలు ఉన్న మొబైల్ ఫోన్‌ను దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది. జైలులోని ఖైదీల వద్ద సెల్‌ఫోన్స్ ఉన్నాయనే సమాచారం మేరకు కర్ణాకటక హోమంత్రి ప్రియాంక్ ఖర్గే ఆదేశాల మేరకు సెంట్రల్ క్రైం బ్యాంచ్ అధికారులు అగ్రహార సెంట్రల్ జైలులో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తినఖీల్లో ప్రజ్వల్ బ్యారక్‌తో సహా మొత్తం 10 సెల్‌ఫోన్స్ దొరికినట్లు అధికారులు తెలిపారు. హై-ప్రొఫైల్ ఖైదీల బ్యారక్‌లు, హై-సెక్యూరిటీ జైలు విభాగాల్లో సీసీబీ అధికారులు దాదాపు నాలుగు నుంచి ఐదు గంటల పాటు సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో మొబైల్ ఫోన్‌తో పాటు, రేవణ్ణ బ్యారక్ నుండి ఒక పెన్ డ్రైవ్, ఛార్జర్‌ను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ సోదాల సమయంలో మరే ఇతర నిషిద్ధ వస్తువులు లభించలేదని జైలు అధికారులు తెలిపారు. ప్రజ్వల్ మొబైల్‌ను పరిశీలించగా సుమారు 80 నుంచి 90 వరకు అశ్లీల వీడియోలు డౌన్లోడ్ చేసుకున్నట్లు గుర్తించారు. ఆ వీడియోలలో చాలా వరకు భారతీయ అశ్లీల కంటెంట్ ఉన్నట్లు సమాచారం. స్వాధీనం చేసుకున్న ఫోన్‌ను ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలతో జైలు అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఇరన్న రంగపూర్ను అధికారులు సస్పెండ్ చేశారు. బెంగళూరు సెంట్రల్ జైలు సూపరింటెండెంట్‌కు కూడా షో-కాజ్ నోటీసులు జారీ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆగస్టు 6న జైలు అధికారులు రేవణ్ణ బ్యారక్‌లో సోదాలు నిర్వహించినప్పటికీ, అప్పుడు ఎటువంటి నిషేధిత వస్తువులు లభించలేదని అధికారులు తెలుపడం గమనార్హం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
‘కోదాడ నియోజకవర్గంలోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి’
Vishvajit More | వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో రజతం.. చరిత్ర సృష్టించిన యువ రెజ్లర్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

