Shriya Saran | రజనీకాంత్‌తో నా మొదటి పరిచయం అలా జరిగింది: శ్రియ శరణ్
Shriya Saran | టాలీవుడ్, కోలీవుడ్ తార నటి శ్రియ శరణ్ (Shriya Saran) సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth)తో నటించిన ‘శివాజీ: ది బాస్’ (Sivaji: The Boss) సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.
Shriya Saran | టాలీవుడ్, కోలీవుడ్ తార నటి శ్రియ శరణ్ (Shriya Saran) సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth)తో నటించిన ‘శివాజీ: ది బాస్’ (Sivaji: The Boss) సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. శ్రియ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక మధురమైన జ్ఞాపకాన్నిశ్రియ తాజాగా పంచుకున్నారు.
దర్శకుడు శంకర్ తనకు ఆ అవకాశం ఇచ్చిన వైనం గురించి ఆమె మాట్లాడుతూ..ఒకరోజు శంకర్ సర్ నాకు ఫోన్ చేసి, ‘ఒక సినిమా ఉంది, అందులో పనిచేస్తావా?’ అని అడిగారు. నేను సరేనని చెప్పాను, ఆయన ‘సరే’ అన్నారు. నేను అక్కడికి వెళ్లేసరికి చాలా మంది ప్రముఖులు వచ్చారు. ఎ.ఆర్. రెహమాన్ సర్, రజనీకాంత్ సర్ వచ్చారు. అప్పుడు నేను శంకర్ గారిని చూసి, ‘ఇది కచ్చితంగా చాలా పెద్ద సినిమా అయి ఉంటుంది’ అనుకున్నాను, ఎందుకంటే అక్కడ అంత పెద్ద వాళ్ళంతా గుమిగూడారు. అప్పుడు ఆయన నన్ను చూసి, ‘మీ కో-స్టార్ రజనీకాంత్ సర్ని కలవండి’ అని చెప్పారు. దానికి నేను షాక్ అయ్యి ‘అవునా… సరే!’ అన్నాను. ఆ తర్వాత అక్కడ ఎ.ఆర్. రెహమాన్ సర్ ఉన్నారు, అలాగే సినిమాటోగ్రాఫర్ కే.వి. ఆనంద్ సర్ కూడా ఉన్నారు” అంటూ రజనీకాంత్‌తో తన మొదటి పరిచయ క్షణాలను శ్రియ ఎంతో సరదాగా గుర్తుచేసుకున్నారు.
#Shriya about First Meeting With #Rajinikanth:
So, #Shankar sir called me and said, “There’s a movie. Will you work in it?” I said yes, and he said, “Okay.”
When I reached there, many big personalities were coming — #ARRahman sir, #Rajinikanth sir. So, I looked at #Shankar and… pic.twitter.com/Tb2g2NC1UQ
— Filmyscoops (@Filmyscoopss) August 13, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

