Raaka | అల్లు అర్జున్ ‘రాకా’లో జాన్వీ కపూర్ పాత్ర ఇదేనా .. ట్రైబల్ క్వీన్‌గా కనిపించబోతుందంటూ కొత్త టాక్!
Raaka | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన తదుపరి సినిమాతో బిజీగా ఉన్నారు. ‘జవాన్’ ఫేమ్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
Raaka | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన తదుపరి సినిమాతో బిజీగా ఉన్నారు. ‘జవాన్’ ఫేమ్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అల్లు అర్జున్ కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌లలో ఒకటిగా భావిస్తున్న ఈ సినిమాకు సంబంధించి కథ, పాత్రలు, కాస్టింగ్ విషయంలో ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన వార్తలు బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ పాత్రకు సంబంధించి ఓ కొత్త ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ సినిమాలో జాన్వీ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నారని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే ఆమె పాత్రకు సంబంధించి ఇప్పటివరకు చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రాలేదు. తాజాగా వస్తున్న కథనాల ప్రకారం.. జాన్వీ కపూర్ ఈ సినిమాలో ఒక ట్రైబల్ క్వీన్ (గిరిజన రాణి) పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఆమె పాత్ర కేవలం గ్లామర్ కోసం మాత్రమే కాకుండా కథలో చాలా కీలకంగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. కథను మలుపు తిప్పే స్థాయిలో ఆమె పాత్రకు ప్రాధాన్యత ఉంటుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో అసలు జాన్వీ పాత్ర ఎలా ఉండబోతుంది? అల్లు అర్జున్ పాత్రతో ఆమెకు ఎలాంటి సంబంధం ఉంటుంది? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరుగుతోంది.
ఈ భారీ ప్రాజెక్ట్ కాస్టింగ్ మొదటి నుంచీ హాట్ టాపిక్‌గా ఉంది. ఇప్పటికే దీపికా పదుకొణె పేరు ఈ సినిమాతో ముడిపడి ఉంది. మరోవైపు జాన్వీ కపూర్, రష్మిక మందన్న కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమవుతారంటూ గతంలో వార్తలు వచ్చాయి.అయితే జాన్వీ, రష్మిక పాత్రల విషయంలో ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. దీంతో సోషల్ మీడియాలో వస్తున్న ప్రతి కొత్త అప్డేట్పై అభిమానులు ఆసక్తిగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా జాన్వీని ట్రైబల్ క్వీన్‌గా చూపించబోతున్నారనే వార్త ఇప్పుడు మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్స్‌లో జరుగుతున్నట్లు సమాచారం. అట్లీ తన సినిమాల్లో భారీ యాక్షన్, గ్రాండ్ విజువల్స్, కమర్షియల్ ఎలిమెంట్స్‌కు ప్రాధాన్యత ఇస్తారనే విషయం తెలిసిందే. అల్లు అర్జున్‌తో ఆయన కలయిక కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింత పెరిగాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Allu arjun
- atlee
- first look
- kaarthi
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

