తుంగతుర్తి, మార్చి 28 : పశువులకు వచ్చే గాలికుంటు వ్యాధి నివారణకు రైతులందరూ తమ పశువులకు టీకాలు వేయించాలని సూర్యాపేట జిల్లా పశు వైద్య సహాయ సంచాలకులు డాక్టర్ వెంకన్న సూచించారు. శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలోని పశు వైద్యశాలను సందర్శించి మాట్లాడారు. గత నాలుగు రోజులుగా జాతీయ పశు వ్యాధి నివారణ కార్యక్రమంలో భాగంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేస్తున్నామని తుంగతుర్తి గ్రామంలో ఇప్పటివరకు 1,000 గాను 802 పశువులకు టీకాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్క రైతు తమ పశువులకు టీకాలు వేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ సంచాలకులు డాక్టర్ బి.రవి ప్రసాద్, ఏవీ రవి, గోపాలమిత్రలు లింగయ్య, శ్రీను, గణేశ్, గ్రామ రైతులు పాల్గొన్నారు.