హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : లాసెట్ రెండో విడత కౌన్సెలింగ్ బుధవారం నుంచి ప్రారంభంకానున్నది. ఈ నెల 19 నుంచి 22 వరకు రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్, 23 నుంచి 25 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు, 26న ఎడిటింగ్‌కు అవకాశం కల్పించినట్టు ప్రవేశాల కమిటీ కన్వీనర్ పాండురంగారెడ్డి తెలిపారు.
ఈ నెల 29న సీట్లు కేటాయిస్తామని, ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 5 వరకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుందన్నారు.