Ramayana | ‘రామాయణ’ ఓటీటీ ప్రేక్షకులకు బిగ్ షాక్.. ఇప్పట్లో డిజిటల్ స్ట్రీమింగ్ లేనట్టేనా?
Ramayana | భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో ఒకటిగా తెరకెక్కిన ఎపిక్ మూవీ ‘రామాయణ పార్ట్ 1’ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, సాయి పల్లవి, కన్నడ రాకింగ్ స్టార్ యష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి దర్శకుడు నితీష్ తివారీ.
Ramayana | భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో ఒకటిగా తెరకెక్కిన ఎపిక్ మూవీ ‘రామాయణ పార్ట్ 1’ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, సాయి పల్లవి, కన్నడ రాకింగ్ స్టార్ యష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి దర్శకుడు నితీష్ తివారీ. భారతీయ ఇతిహాసమైన రామాయణాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులకు పరిచయం చేయాలనే లక్ష్యంతో భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందించారు. ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తూ దూసుకెళ్తోంది.ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1,800 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. థియేటర్లలో ఇంకా మంచి ఆదరణ కొనసాగుతుండటంతో ఈ సినిమా ఓటీటీ విడుదలపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
అయితే తాజాగా ఈ మూవీ నిర్మాత నమిత్ మల్హోత్రా చేసిన వ్యాఖ్యలు ఓటీటీ ప్రేక్షకులకు నిరాశ కలిగిస్తున్నాయి. సాధారణంగా భారీ బడ్జెట్ సినిమాలు థియేటర్లలో విడుదలైన కొన్ని వారాలకే ఓటీటీలోకి వస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్లో కొన్ని చిత్రాలు నెల రోజుల వ్యవధిలోనే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. దీంతో ‘రామాయణ’ కూడా త్వరలోనే ఓటీటీలోకి వస్తుందని చాలామంది భావించారు. కానీ ఈ విషయంలో నిర్మాత నమిత్ మల్హోత్రా భిన్నమైన నిర్ణయంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, ‘రామాయణ’ చిత్రాన్ని ప్రధానంగా పెద్ద తెరపై ప్రేక్షకులు అద్భుతమైన అనుభూతిని పొందేలా రూపొందించామని వెల్లడించినట్లు సమాచారం. అందుకే ఇప్పట్లో ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసే ఆలోచన లేదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మరికొన్ని నెలల పాటు థియేటర్లలోనే ఈ సినిమాను ప్రేక్షకులు ఆస్వాదించేలా చేయాలన్నది నిర్మాతల ఉద్దేశంగా కనిపిస్తోంది.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ‘రామాయణ’ డిజిటల్ హక్కులకు సంబంధించి ప్రస్తుతం చర్చలు మాత్రమే జరుగుతున్నాయట. ఇప్పటివరకు ఏ ఓటీటీ సంస్థకూ ఈ సినిమా హక్కులను అధికారికంగా విక్రయించలేదని నమిత్ మల్హోత్రా వెల్లడించినట్లు సమాచారం. దీంతో ఈ సినిమా ఏ డిజిటల్ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది? ఎప్పుడు ఓటీటీలోకి రానుంది? అనే ప్రశ్నలకు ప్రస్తుతానికి సమాధానం లేనట్లే. ‘రామాయణ’ను కేవలం ఒక సాధారణ సినిమాగా కాకుండా ప్రపంచ ప్రేక్షకులకు భారతీయ ఇతిహాస గొప్పతనాన్ని పరిచయం చేసే భారీ ప్రాజెక్ట్‌గా రూపొందిస్తున్నారు. అందుకే విజువల్ ఎఫెక్ట్స్, భారీ సెట్స్, అంతర్జాతీయ స్థాయి సాంకేతిక ప్రమాణాలకు పెద్దపీట వేశారు. ఇలాంటి సినిమాను మొబైల్ లేదా టీవీ స్క్రీన్లపై కాకుండా థియేటర్లలోనే చూడాలని నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ ఓటీటీ ప్రేక్షకులకు బిగ్ షాక్.. ఇప్పట్లో డిజిటల్ స్ట్రీమింగ్ లేనట్టేనా?
AP News | పంచాయతీ ఎన్నికల్లో ఓటేసిన శతాధిక వృద్ధురాలు.. సీఎం చంద్రబాబు ప్రశంస..!
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు మరో ఉద్యమం చేపట్టాలి : బొల్లం మల్లయ్య యాదవ్
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
Gentleman | 33 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి శంకర్ ‘జెంటిల్మెన్’.. డిసెంబర్ 11న 4కే వెర్షన్‌తో గ్రాండ్ రీ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

