తెలంగాణ ప్రజల్లో ఉద్యమ జ్వాలాను రగిలించిన రోజే దీక్ష దివస్ : రవీంద్ర కుమార్
తెలంగాణ ప్రజల్లో ఉద్యమ జ్వాలాను రగిలించిన రోజే దీక్ష దివస్ అని మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు.
తెలంగాణ ప్రజల్లో ఉద్యమ జ్వాలాను రగిలించిన రోజే దీక్ష దివస్ అని మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు. ఆదివారం దేవరకొండలో బీఆర్ఎస్ చేపట్టిన దీక్షా దివస్ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పై కేంద్ర ప్రభుత్వం నాన్చుడి ధోరణి అవలంబించడంతో ఆవేదన చెందిన కేసీఆర్ తెలంగాణ వచ్చుడో కెసిఆర్ సచ్చుడో అన్న నినాదంతో 2009 నవంబర్ 26న ఆమరణ నిరాహార దీక్ష దిగారన్నారు.
కెసిఆర్ ను ఆమరణ దీక్ష చేయకుండా మార్గమధ్యంలో అడ్డుకొని ఖమ్మం జైలుకు తరలించారని గుర్తు చేశారు. కెసిఆర్ ఖమ్మం జైల్లో అన్నపానీయాలు ముట్టకుండా ఆమరణ దీక్షకు దిగడంతో తెలంగాణ సమాజంలో ఉద్యమ జ్వాలా రగిలింది. పల్లె పల్లెనా ప్రజలు ముందుకొచ్చి జై తెలంగాణ నినాదం పెట్టుకోవడంతో కేంద్రం దిగివచ్చి 2009 డిసెంబర్ 9న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించిందన్నారు. కార్యక్రమంలో నాయకులు కేతావత్ భీల్యా నాయక్ , నేనావత్ కిషన్ నాయక్ , రమేష్ నాయక్ పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
తెలంగాణ ప్రజల్లో ఉద్యమ జ్వాలాను రగిలించిన రోజే దీక్ష దివస్ : రవీంద్ర కుమార్
Ramayana | ‘రామాయణ’ ఓటీటీ ప్రేక్షకులకు బిగ్ షాక్.. ఇప్పట్లో డిజిటల్ స్ట్రీమింగ్ లేనట్టేనా?
AP News | పంచాయతీ ఎన్నికల్లో ఓటేసిన శతాధిక వృద్ధురాలు.. సీఎం చంద్రబాబు ప్రశంస..!
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు మరో ఉద్యమం చేపట్టాలి : బొల్లం మల్లయ్య యాదవ్
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

