హైదరాబాద్, ఆగస్టు 18(నమస్తే తెలంగాణ): రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుక్ చేసుకున్న వారి ఆస్తులు 22-ఏ జాబితాలో ఉంటే, రెండు రోజుల్లో పరిశీలించి అది ప్రైవేట్ భూమి అయితే వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉన్నతాధికారులతో మంగళవారం సమీక్షించారు. ప్రజల ఆస్తి హకుల పరిరక్షణకు తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నదని స్పష్టంచేశారు.
ఆస్తులు కలిగిన వారు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎలాంటి ఆటంకాలు ఉండకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. 22-ఏ జాబితా భూములను కలెక్టర్లు క్షుణ్ణంగా పరిశీలించి, తప్పులు లేకుండా శాశ్వత పరిషారానికి సరైన జాబితాను రూపొందించాలని ఆదేశించారు. ప్రజలు దళారులు, మధ్యవర్తులను ఆశ్రయించవద్దని కోరారు.