SIM Cards | సిమ్ కార్డ్ దుర్వినియోగం చేస్తే మూడేండ్ల జైలు.. రూ.50 లక్షల జరిమానా
SIM Cards | మీపేరుతో జారీ అయిన సిమ్ కార్డులు ఇతరులు వాడకుండా చూడాలని మొబైల్ వినియోగదారులను టెలికమ్యూనికేషన్ల శాఖ(డీవోటీ) హెచ్చరించింది.
SIM Cards | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21 : మీపేరుతో జారీ అయిన సిమ్ కార్డులు ఇతరులు వాడకుండా చూడాలని మొబైల్ వినియోగదారులను టెలికమ్యూనికేషన్ల శాఖ(డీవోటీ) హెచ్చరించింది. మోసపూరిత సిమ్ జారీ, దుర్వినియోగం, ఐఎంఈఐ నంబర్లను తారుమారు చేయడం వంటివి తీవ్రమైన చట్టపరమైన పరిణామాలకు దారితీస్తాయని హెచ్చరించింది.
టెలికమ్యూనికేషన్ల చట్టం, 2023 కింద అటువంటి ఉల్లంఘనలకు మూడేండ్ల వరకు జైలు శిక్ష, రూ.50 లక్షల వరకు జరిమానా విధించవచ్చని సోమవారం జారీచేసిన ఒక ప్రకటనలో డీవోటీ హెచ్చరించింది. తమకు తెలియకుండానే తమ గుర్తింపు పత్రాలపై మొబైల్ కనెక్షన్లు జారీ అయి ఉండవచ్చని భావించే వారికి లేదా తమ పేరు మీద నమోదైన సిమ్ కార్డులను వేరొకరికి ఇచ్చిన వారికి ఈ హెచ్చరిక చాలా ముఖ్యమైనది. తమ గుర్తింపుతో అనుసంధానం పొందిన అన్ని మొబైల్ నంబర్లను సంచార్ సాథీ పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవాలని ప్రజలకు డీవోటీ సూచించింది. ఇటీవల సైబర్ క్రైమ్ దర్యాప్తుల్లో వెలుగులోకి వచ్చిన ఒక కేసు నేపథ్యంలో ఈ హెచ్చరిక జారీ అయింది.
ఈ కేసులో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఒక పాయింట్ ఆఫ్ సేల్(పీఓఎస్) ఏజెంట్ పౌరులకు తెలియకుండా లేదా వారి అనుమతి లేకుండా వారి గుర్తింపు పత్రాలను ఉపయోగించిన 25 మొబైల్ కనెక్షన్లను యాక్టివేట్ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని కనుగొన్న తర్వాత డీవోటీ, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు ఆ పీవోఎస్‌ను బ్లాక్‌లిస్ట్ చేసి తదుపరి సిమ్ కార్డులను జారీ చేయకుండా నిరోధించాయి. ఆ 25 కనెక్షన్లను డీవోటీకి చెందిన డిటిజల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా పరిశీలించి అనుమానాస్పదంగా గుర్తించిన కనెక్షన్లను పునఃపరిశీలన కోసం పంపి తదనంతరం వాటిని డీయాక్టివేట్ చేశారు. తమ గుర్తింపు పత్రాలను ఉపయోగించి ఒక మొబైల్ నంబర్‌ను పొందారన్న విషయం ఒక వ్యక్తికి తెలిసే అవకాశం లేదు కాబట్టే ఈ ఘటన వినియోగదారులకు పొంచి ఉన్న ప్రమాదాన్ని తెలియచేస్తుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

