Tamil Nadu Assembly polls | 164 స్థానాల్లో డీఎంకే పోటీ.. మిత్రపక్షాలకు 70 స్థానాలు
Tamil Nadu Assembly polls | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కోసం అధికార డీఎంకే తొలి జాబితా విడుదల చేసింది. మొత్తం 234 స్థానాలకు గాను 164 స్థానాల్లో డీఎంకే పోటీ చేయనున్నది. మిగతా 70 స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించింది.
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కోసం అధికార డీఎంకే తొలి జాబితా విడుదల చేసింది. మొత్తం 234 స్థానాలకు గాను 164 స్థానాల్లో డీఎంకే పోటీ చేయనున్నది. మిగతా 70 స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించింది. (Tamil Nadu Assembly polls) అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపిణీ గురించి సీఎం ఎంకే స్టాలిన్ శనివారం వెల్లడించారు. 164 స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్‌కు 28 సీట్లు, డీఎండీకేకు 10, వీసీకేకు 8 స్థానాలు, సీపీఐ, సీపీఎం పార్టీలకు చెరో 5 సీట్లు, ఎండీఎంకేకు 4, మిగతా సీట్లను చిన్న పార్టీలకు కేటాయించినట్లు వివరించారు.
కాగా, సీఎం ఎంకే స్టాలిన్ తన కొలత్తూరు నియోజకవర్గం నుంచే తిరిగి పోటీ చేయనున్నారు. ఆయన కుమారుడు, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి చెపాక్-ట్రిప్లికేన్ నుంచి బరిలోకి దిగుతున్నారు. ఇటీవల డీఎంకేలో చేరిన మాజీ సీఎం ఓ పన్నీర్‌సెల్వంకు కూడా తొలి జాబితాలో చోటుదక్కింది. బోడినాయకనూరు స్థానం నుంచి ఆయన పోటీ చేయనున్నారు. కోయంబత్తూరు సౌత్ స్థానం నుంచి మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ బరిలోకి దిగుతున్నారు.
Also Read:
Watch: స్కూటీని రాసుకుని వెళ్లినందుకు.. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌ను ధ్వంసం చేసిన మహిళ
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- 164 seats
- CM MK Stalin
- contest
- DMK
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

