Watch: స్కూటీని రాసుకుని వెళ్లినందుకు.. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌ను ధ్వంసం చేసిన మహిళ
Jaipur Woman Vandalises Bike | ట్రాఫిక్ రద్దీ నేపథ్యంలో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్, ఒక స్కూటీని స్వల్పంగా రాసుకుని వెళ్లింది. ఆ స్కూటీకి చెందిన మహిళ దీనిపై తీవ్ర ఆగ్రహం చెందింది. హెల్మెట్‌తో పాటు రాయితో కొట్టి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌ను ధ్వంసం చేసింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
జైపూర్: ట్రాఫిక్ రద్దీ నేపథ్యంలో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్, ఒక స్కూటీని స్వల్పంగా రాసుకుని వెళ్లింది. ఆ స్కూటీకి చెందిన మహిళ దీనిపై తీవ్ర ఆగ్రహం చెందింది. హెల్మెట్‌తో పాటు రాయితో కొట్టి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌ను ధ్వంసం చేసింది. (Jaipur Woman Vandalises Bike) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఈ సంఘటన జరిగింది. గురువారం ఇరుకైన రోడ్డులో ట్రాఫిక్ రద్దీ నేపథ్యంలో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఒక స్కూటీని స్వల్పంగా ఢీకొట్టింది.
కాగా, ఆ స్కూటీకి చెందిన మహిళ దీనిపై తీవ్ర వాగ్వాదానికి దిగింది. ఆ తర్వాత ఆగ్రహంతో ఆమె ఊగిపోయింది. ఆ వ్యక్తికి చెందిన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌పై తన ప్రతాపం చూపింది. పార్క్ చేసిన ఆ బైక్‌ను తొలుత హెల్మెట్, ఆ తర్వాత ఇటుక రాయితో ధ్వంసం చేసింది. హెడ్‌లైట్, స్పీడోమీటర్, బ్యాక్, సైడ్ లైట్లను పగులగొట్టింది.
మరోవైపు పోలీస్‌ను పిలుస్తానని ఆ వ్యక్తి హెచ్చరించినప్పటికీ ఆ మహిళ ఏ మాత్రం లెక్కచేయలేదు. పైగా ‘పోలీసులను పిలుచుకో.. నాకేం కాదు’ అని అన్నది. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌ను ధ్వంసం చేసిన తర్వాత చేతులు దులుపుకుని, వాటిని చూపిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీస్ ఆ మహిళను నిలువరించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
అయితే ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ మహిళ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పోలీసులు స్పందించారు. ఆ మహిళపై చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారి పేర్కొన్నారు.
A woman went barserk after a minor incident of road rage in Jaipur, Rajasthan. Used helmet and brick to vandalise a motorcycle. pic.twitter.com/ON2dfAuwLy
— Piyush Rai (@Benarasiyaa) March 26, 2026
Also Read:
Woman elopes twice | వారంలో రెండుసార్లు పారిపోయిన మహిళ.. ఆమె భర్తను బెదిరించిన ప్రియుడు
Claims As Godman, Man Raps Woman | శివుడి అవతారమని నమ్మించిన వ్యక్తి.. మహిళపై అత్యాచారం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్‌తో ప్రమాదాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

