Woman elopes twice | వారంలో రెండుసార్లు పారిపోయిన మహిళ.. ఆమె భర్తను బెదిరించిన ప్రియుడు
Woman elopes twice | వివాహిత మహిళ తన ప్రియుడితో కలిసి వారం రోజుల్లో రెండుసార్లు ఇంటి నుంచి పారిపోయింది. భర్త తొలి ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు ఆ మహిళను వెతికి తెచ్చారు. అయితే ఆ మరునాడే మరోసారి ఆ వ్యక్తితో కలిసి ఆమె పారిపోయింది. ఈ సందర్భంగా ఆమె భర్తను ప్రియుడు బెదిరించాడు.
లక్నో: వివాహిత మహిళ తన ప్రియుడితో కలిసి వారం రోజుల్లో రెండుసార్లు ఇంటి నుంచి పారిపోయింది. భర్త తొలి ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు ఆ మహిళను వెతికి తెచ్చారు. అయితే ఆ మరునాడే మరోసారి ఆ వ్యక్తితో కలిసి ఆమె పారిపోయింది. ఈ సందర్భంగా ఆమె భర్తను ప్రియుడు బెదిరించాడు. (Woman elopes twice) ఉత్తరప్రదేశ్‌లోని బాందా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 24 ఏళ్ల వివాహిత మహిళ తన ప్రియుడు జిలేదార్ ఖాన్‌తో కలిసి వారం రోజుల కిందట ఇంటి నుంచి పారిపోయింది. భర్త ఫిర్యాదుపై ఆమె కోసం పోలీసులు వెతికారు. ఆ మహిళ ఆచూకీని గుర్తించారు. మార్చి 23న భర్తకు ఆమెను అప్పగించారు.
కాగా, మరునాడైన మార్చి 24న ప్రియుడు జిలేదార్ ఖాన్ మళ్లీ ఆ మహిళ ఇంటికి వచ్చాడు. దీంతో వారిద్దరూ ఇంటి నుంచి వెళ్తుండగా ఆమె భర్త అడ్డుకున్నాడు. ఈ నేపథ్యంలో అతడ్ని దూషించడంతో పాటు చంపుతానని జిలేదార్ ఖాన్ బెదిరించాడు. అతడి భార్యను తీసుకుని వెళ్లిపోయాడు.
మరోవైపు ప్రియుడు జిలేదార్ ఖాన్‌తో కలిసి తన భార్య రెండోసారి పారిపోయినట్లు స్థానిక పోలీస్ స్టేషన్లో భర్త ఫిర్యాదు చేశాడు. అడ్డుకోయిన తనను అతడు దూషించడంతోపాటు చంపుతానని బెదిరించినట్లు ఆరోపించాడు.
దీంతో జిలేదార్ ఖాన్‌పై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ మహిళ కోసం వెతికేందుకు ప్రయత్నిస్తున్నారు. వారి ఆచూకీ లభించిన తర్వాత చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారి తెలిపారు.
Also Read:
Claims As Godman, Man Raps Woman | శివుడి అవతారమని నమ్మించిన వ్యక్తి.. మహిళపై అత్యాచారం
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Banda
- elopes
- MAN
- married woman
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్‌పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

