Woman Official Arrested in Scam | కేబీసీలో రూ.50 లక్షలు గెలుచుకున్న అధికారిణి.. రూ.2.5 కోట్ల స్కామ్‌లో అరెస్ట్
Woman Official Arrested in Scam | ఒక మహిళా అధికారిణి ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ టీవీ కార్యక్రమంలో రూ. 50 లక్షలు గెలుచుకున్నది. దీని వల్ల జాతీయ స్థాయిలో ఆమె గుర్తింపు పొందింది. అయితే ఆ మహిళా తహసీల్దార్ రూ.2.5 కోట్ల వరద సహాయ నిధుల స్కామ్‌లో అరెస్ట్ అయ్యింది.
భోపాల్: ఒక మహిళా అధికారిణి ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ టీవీ కార్యక్రమంలో రూ. 50 లక్షలు గెలుచుకున్నది. దీని వల్ల జాతీయ స్థాయిలో ఆమె గుర్తింపు పొందింది. అయితే ఆ మహిళా తహసీల్దార్ రూ.2.5 కోట్ల వరద సహాయ నిధుల స్కామ్‌లో అరెస్ట్ అయ్యింది. (Woman Official Arrested in Scam) బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. 2021లో షియోపూర్ జిల్లాలోని బరోడా తహసీల్దార్‌గా అమితా సింగ్ తోమర్ పని చేశారు. ఈ సమయంలో కొంత మంది రెవెన్యూ అధికారులతో కలిసి భారీ స్కామ్‌కు ఆమెకు పాల్పడింది. సుమారు రూ.2.5 కోట్ల వరద సహాయ నిధులను నకిలీ బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసి కొల్లగొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి.
కాగా, ఉన్నతాధికారుల ఫిర్యాదుతో బరోడా సబ్ డివిజనల్ పోలీస్ అధికారి (ఎస్డీవోపీ) అవనీత్ శర్మ నేతృత్వంలోని బృందం ఈ కుంభకోణంపై దర్యాప్తు చేసింది. ప్రస్తుతం విజయపూర్ తహసీల్దార్‌గా ఉన్న అమితా సింగ్ తోమర్, 22 మంది రెవెన్యూ అధికారులతో సహా మొత్తం 110 మందిపై కేసు నమోదు చేశారు.
మరోవైపు కేసు నమోదు నేపథ్యంలో అమితా సింగ్ తోమర్ గత కొన్ని రోజులుగా విధులకు హాజరుకావడం లేదు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఆమె పిటిషన్లను న్యాయస్థానాలు తిరస్కరించాయి. బుధవారం ఆమెపై కలెక్టర్ చర్యలు చేపట్టారు. తహసీల్దార్ పదవి నుంచి తొలగించారు.
అయితే అదృశ్యమైన అమితా సింగ్ కోసం పోలీస్ బృందాలు వెతకసాగాయి. గ్వాలియర్‌లోని నివాసంలో ఆమె ఉన్నట్లు తెలుసుకుని గురువారం అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరిచిన తర్వాత పొరుగున ఉన్న శివపురి జైలుకు అమితా సింగ్‌ను తరలించినట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Woman, Brother Stabbed To Death | మహిళ, ఆమె సోదరుడ్ని.. కత్తితో పొడిచి చంపిన భర్త ప్రియురాలి కొడుకు
Jag Vasant | గుజరాత్ పోర్ట్‌కు చేరిన మరో ఎల్పీజీ నౌక ‘జగ్ వసంత్’
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కెమిస్ట్రీ వెంకటేశ్వరరావు మృతి కోదాడ పబ్లిక్ క్లబ్‌కు తీరని లోటు’
‘బతుకమ్మ పండుగ ఏర్పాట్లలో వివక్షత తగదు’
Gurugram | బర్త్‌డే నాడే భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న ఐటీ ఉద్యోగి.. చివరగా కంపెనీకి మెయిల్
Boys Kill Friend | బైక్, బర్త్ డే వేడుకకు డబ్బు కోసం.. స్నేహితుడ్ని హత్య చేసిన ఇద్దరు బాలురు
Dhruv Rathee | 2018 నాటి కేసులో యూట్యూబర్ ధృవ్రాఠీకి అరెస్ట్ వారెంట్ జారీ.. బీజేపీపై వీడియో చేసిన కేసులో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

