Jag Vasant | గుజరాత్ పోర్ట్‌కు చేరిన మరో ఎల్పీజీ నౌక ‘జగ్ వసంత్’
Jag Vasant | దేశంలో గ్యాస్ సంక్షోభం నేపథ్యంలో మరో ఎల్పీజీ నౌక ‘జగ్ వసంత్’ భారత్ చేరుకున్నది. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో హోర్ముజ్ జలసంధి వద్ద 23 రోజుల పాటు ఇది చిక్కుకున్నది. ఇరాన్‌తో భారత్ దౌత్య చర్చల నేపథ్యంలో ఇటీవల హోర్ముజ్ జలసంధిని ఇది దాటింది.
అహ్మదాబాద్: దేశంలో గ్యాస్ సంక్షోభం నేపథ్యంలో మరో ఎల్పీజీ నౌక ‘జగ్ వసంత్’ భారత్ చేరుకున్నది. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో హోర్ముజ్ జలసంధి వద్ద 23 రోజుల పాటు ఇది చిక్కుకున్నది. (Jag Vasant) ఇరాన్‌తో భారత్ దౌత్య చర్చల నేపథ్యంలో ఇటీవల హోర్ముజ్ జలసంధిని ఇది దాటింది. 47,600 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ లోడ్‌తో ఉన్న ‘జగ్ వసంత్’ ట్యాంకర్ గురువారం రాత్రి గుజరాత్‌లోని పోర్ట్‌కు చేరుకున్నది.
కాగా, 45,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీని రవాణా చేస్తున్న ‘పైన్ గ్యాస్’ అనే మరో ఎల్పీజీ ట్యాంకర్ త్వరలో న్యూ మంగళూరు పోర్ట్‌కు చేరనున్నది. దీని రాకతో దేశంలోని ప్రస్తుత ఎల్పీజీ నిల్వలకు అదనంగా 92,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ చేకూరుతుంది. దేశంలో ఒక రోజు వంటగ్యాస్ వినియోగానికి ఇది సమానం.
మరోవైపు గత పది రోజుల్లో హోర్ముజ్ జలసంధిని దాటిన రెండు పెద్ద ఎల్పీజీ ట్యాంకర్లు ఇప్పటికే భారత్ చేరుకున్నాయి. మధ్యప్రాచ్య ప్రాంతంలో కొనసాగుతున్న సంఘర్షణ కారణంగా ప్రస్తుతం హార్ముజ్ జలసంధిలో 20 భారత నౌకలు చిక్కుకున్నట్లు షిప్పింగ్ మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటిలో ఐదు భారీ ఎల్పీజీ ట్యాంకర్లు ఉన్నట్లు పేర్కొంది. వీటి రాకతో 2,30,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ అందుబాటులోకి వస్తుందని వెల్లడించింది. మరో భారీ ఎల్పీజీ ట్యాంకర్ కూడా ఒకటి లేదా రెండు రోజుల్లో ఎల్పీజీని నింపుకుని భారత్‌కు బయలుదేరుతుందని వివరించింది.
Also Read:
Fuel Supplies | దేశంలో 60 రోజులకు సరిపడా చమురు నిల్వలు.. ఆందోళన అక్కర్లేదన్న కేంద్రం
Bengal Polls | ఆర్జీ కర్ బాధితురాలి తల్లి బెంగాల్ ఎన్నికల్లో పోటీ.. బీజేపీ మూడో జాబితాలో చోటు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | వైసీపీ వాహనాలకు నిప్పు పెట్టిన దుండగులు.. రాయచోటిలో తీవ్ర ఉద్రిక్తత
Adarsha Kutumbam | వెంకీ, త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ మరోసారి వాయిదా.?
Harsha Chemudu | ట్రెండింగ్‌లో ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’.. దర్శకుడికి ఖరీదైన బైక్ బహుమతిగా ఇచ్చిన హర్ష చెముడు!
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ విధ్వంసం.. తొలి రోజే రూ.125 కోట్లకు పైగా వసూళ్లు!
Regime Change: అధికార మార్పిడి జరగాలన్న ప్రశాంత్ భూషణ్.. ఆ వ్యాఖ్యలను వ్యతిరేకించిన అభిజీత్ దీప్కే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

