Goa BJP corporator’s son arrested | 30 మంది బాలికలపై మూడేళ్లుగా అత్యాచారం.. బీజేపీ కార్పొరేటర్ కుమారుడు అరెస్ట్
Goa BJP corporator's son arrested | బీజేపీ కార్పొరేటర్ కుమారుడి దారుణాలు బయటపడ్డాయి. సుమారు 30 మంది బాలికలపై మూడేళ్లుగా అతడు అత్యాచారానికి పాల్పడ్డాడు. వీడియోలు రికార్డ్ చేసి వారిని బ్లాక్మెయిల్ చేశాడు. స్నేహితులతో కలిసి మద్యం సేవించి ఆ యువకుడు ఈ వీడియోలను వారికి చూపించాడు. స్థానికుల్లో ఆగ్రహం రేకెత్తడంతో అతడ్ని అరెస్ట్ చేశారు.
పనాజీ: బీజేపీ కార్పొరేటర్ కుమారుడి దారుణాలు బయటపడ్డాయి. సుమారు 30 మంది బాలికలపై మూడేళ్లుగా అతడు అత్యాచారానికి పాల్పడ్డాడు. వీడియోలు రికార్డ్ చేసి వారిని బ్లాక్మెయిల్ చేశాడు. స్నేహితులతో కలిసి మద్యం సేవించి ఆ యువకుడు ఈ వీడియోలను వారికి చూపించాడు. స్థానికుల్లో ఆగ్రహం రేకెత్తడంతో అతడ్ని అరెస్ట్ చేశారు. (Goa BJP corporator’s son arrested) బీజేపీ పాలిత గోవాలో ఈ సంఘటన జరిగింది. బీజేపీ కార్పొరేటర్ సుశాంత్ నాయక్ కుమారుడైన 22 ఏళ్ల సోహమ్ సుమారు 30 మంది బాలికలను లైంగికంగా వేధించాడు. గత మూడేళ్లుగా పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ వీడియోలను రికార్డ్ చేసి వారిని బ్లాక్మెయిల్ చేశాడు. ఎవరికైనా చెబితే ఆ వీడియోలను ఆన్లైన్లో సర్క్యులేట్ చేస్తానని మైనర్ బాలికలను అతడు బెదిరించాడు.
కాగా, మార్చి 22న ఆదివారం రాత్రి సోహమ్ తన స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు. ఈ సందర్భంగా బాలికలతో లైంగిక చర్యల వీడియోలను ఫ్రెండ్స్కు చూపించాడు. దీంతో ఈ విషయం బయటపడింది. ఇది తెలుసుకుని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. సోహమ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు.
మరోవైపు సోహమ్ నుంచి స్వాధీనం చేసుకున్న డిజిటల్ ఆధారాలను పరిశీలిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. సుమారు 30 మంది మైనర్ బాలికలను లైంగికంగా వేధించిన నిందితుడిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధిత బాలికలను గుర్తించి వారి వాంగ్మూలాలు రికార్డ్ చేస్తామని అన్నారు. బాధిత బాలికల గోప్యత, భద్రతకు హామీ ఇచ్చారు.
Also Read:
Bengal Polls | ఆర్జీ కర్ బాధితురాలి తల్లి బెంగాల్ ఎన్నికల్లో పోటీ.. బీజేపీ మూడో జాబితాలో చోటు
Railways Fines IRCTC | సొంత సంస్థ ‘ఐఆర్సీటీసీ’కు.. రూ.10 లక్షల జరిమానా విధించిన రైల్వే
Air India London flight U-turn | ఎయిర్ ఇండియా లండన్ విమానం.. సౌదీ గగనతలంలో యూ టర్న్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

