Railways Fines IRCTC | సొంత సంస్థ ‘ఐఆర్సీటీసీ’కు.. రూ.10 లక్షల జరిమానా విధించిన రైల్వే
Railways Fines IRCTC | వందే భారత్ రైలు ప్రయాణికుడి ఆహార ఫిర్యాదుపై రైల్వే స్పందించింది. సొంత సంస్థ అయిన ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ)కు రూ. 10 లక్షల జరిమానా విధించింది. క్యాటరింగ్ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు పలు చర్యలు చేపట్టింది.
న్యూఢిల్లీ: వందే భారత్ రైలు ప్రయాణికుడి ఆహార ఫిర్యాదుపై రైల్వే స్పందించింది. సొంత సంస్థ అయిన ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ)కు రూ. 10 లక్షల జరిమానా విధించింది. (Railways Fines IRCTC) క్యాటరింగ్ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు పలు చర్యలు చేపట్టింది. మార్చి 15న పాట్నా-టాటానగర్ వందే భారత్ ఎక్స్ప్రెస్లో అందించిన ఆహారం నాణ్యతపై ఒక ప్రయాణికుడు ఫిర్యాదు చేశాడు. దీనిపై రైల్వే సీరియస్గా స్పందించింది. సొంత సంస్థ ఐఆర్సీటీసీకి రూ.10 లక్షల జరిమానా విధించింది. అలాగే సంబంధిత సర్వీస్ ప్రొవైడర్కు రూ.50 లక్షల జరిమానా విధించడంతో పాటు కాంట్రాక్టును రద్దు చేయాలని ఆదేశించింది. ప్రయాణికుల భద్రత, ఆహార నాణ్యత తమ ప్రధాన ప్రాధాన్యతలు అని రైల్వే అధికారి తెలిపారు.
కాగా, రైళ్లలో ఏటా సుమారు 58 కోట్ల భోజనాలను రైల్వే అందిస్తున్నది. అయితే ఆహార నాణ్యత, అధిక ఛార్జీలకు సంబంధించిన ఫిర్యాదులు సగటున 0.0008 శాతం మాత్రమే ఉన్నాయని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఫిర్యాదులపై విచారణ తర్వాత గత మూడేళ్లలో రూ.2.6 కోట్ల మేర జరిమానాలు విధించినట్లు పేర్కొంది.
మరోవైపు రైలు ప్రయాణికులపై పాంట్రీ కార్ సిబ్బంది దాడి చేసినట్లుగా 2025లో 3 సంఘటనలు నమోదైనట్లు రైల్వే తెలిపింది. ప్రభుత్వ రైల్వే పోలీసులు ఆ పాంట్రీ సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది.
Also Read:
Ex-MLA’s Son Charred Body Found | కారులో మాజీ ఎమ్మెల్యే కుమారుడి కాలిన మృతదేహం.. హత్యగా అనుమానం
Kotak Mahindra Fraud | హర్యానాలో ఐడీఎఫ్సీ తర్వాత.. కోటక్ మహీంద్రా బ్యాంకులో రూ.160 కోట్ల మోసం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harsha Chemudu | ట్రెండింగ్లో ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’.. దర్శకుడికి ఖరీదైన బైక్ బహుమతిగా ఇచ్చిన హర్ష చెముడు!
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ విధ్వంసం.. తొలి రోజే రూ.125 కోట్లకు పైగా వసూళ్లు!
Regime Change: అధికార మార్పిడి జరగాలన్న ప్రశాంత్ భూషణ్.. ఆ వ్యాఖ్యలను వ్యతిరేకించిన అభిజీత్ దీప్కే
90 Hours Fasting | 90 గంటల పాటు నిరంతరాయంగా ఉపవాసం ఉండడం సాధ్యమేనా.. డాక్టర్లు ఏమంటున్నారు..?
Parliament: డీలిమిటేషన్, వుమెన్స్ కోటా బిల్లులు.. ఈనెలలోనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

