నాగర్కర్నూల్ జిల్లాలో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం ఇప్పల తండాలో కేతావత్ చిట్టెమ్మ (46) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం ఇప్పల తండాలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
స్థానికుల వివరాల ప్రకారం.. బొరుసుగడ్డ గ్రామపంచాయతీ పరిధిలోని ఇప్పల తండాకు చెందిన కేతావత్ చిట్టెమ్మ (46) లట్టుపల్లి గ్రామ సమీపంలోని ఓ రైస్ మిల్లులో పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. రోజువారీగా ఆదివారం కూడా పనికి వెళ్లిన ఆమె.. తిరిగి ఇంటికి వచ్చి నిద్రించింది.
సోమవారం ఉదయం ఇంటి తలుపులు తీయకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. వారు ఇంట్లోకి వెళ్లి చూడగా చిట్టెమ్మ మృతి చెంది కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.
చిట్టెమ్మ భర్త జుంపాలియా కూడా మూడేళ్ల క్రితం బావిలో పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై ఎస్సై శంషాద్దీన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగర్కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా మృతికి గల కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

