నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 10 : కరెంట్ కోసం రైతులు అరిగోస పడుతున్నారు. విద్యుత్తు కోతలతో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. అప్రకటిత కరెంట్ కోతలు, లోవోల్టేజీ సమస్యలు, యూరియా దక్కకపోవడం వంటి సమస్యలపై పోరుబాట పట్టారు. ఇందులో భాగంగా గురువారం రైతులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. సబ్స్టేషన్లను ముట్టడించి, రహదారులపై రాస్తారోకోలు చేపట్టి సర్కార్ తీరుపై మండిపడ్డారు. వనపర్తి జిల్లా కడుకుంట్ల, పెద్దగూడెం గ్రామాల రైతులు కడుకుంట్ల సబ్‌స్టేషన్ ఎదుట ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం మాన్‌దొడ్డి సబ్‌స్టేషన్ ను ముట్టడించారు. నారాయణపేట జిల్లా మక్త ల్ మండలం గుడిగండ్ల, జక్లేర్ గ్రామాల రైతు లు గుడిగండ్ల సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. సమీపంలోని జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తడ్పాకల్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం చుక్కాపూర్లో రోడ్డుపై బైఠాయించారు.
పాల్వంచ మండలం మర్రి వద్ద రోడ్డుపై నిరసన తెలిపారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో రాస్తారోకో చేసి విద్యుత్తు అధికారులకు వినతిపత్రం అందజేశారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు సబ్‌స్టేషన్ ఎదుట బైఠాయించారు. అనంతరం లాగ్‌బుక్ పరిశీలించగా 8 గంటలు మాత్రమే ఇస్తున్నట్టు ఉం డగా.. మరి ఎందుకు 24 గంటలు ఇస్తున్నామని అబద్ధాలు చెప్తున్నారని ఏఈ శివకుమార్‌ను నిలదీశారు. యాదాద్రి జిల్లా ఆలేరు మం డలం కొలనుపాక సబ్‌స్టేషన్ వద్ద మాజీ సర్పంచ్ ఆరుట్ల లక్ష్మీ ప్రసాద్‌రెడ్డితోపాటు రైతులు ధర్నాకు దిగారు. 18 గంటలు ఇచ్చే కరెంట్ ఇప్పుడు 12 నుంచి 8 గంటలకు తగ్గిపోవడంతో పంటలు ఎండుతున్నాయని ఆగ్ర హం వ్యక్తం చేశారు. భువనగిరి మండలం తుక్కాపురంలో సర్పంచ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జనగాం పాండు ఆధ్వర్యంలో రైతు లు సబ్‌స్టేషన్ ముట్టడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట లో రైతులు రోడ్డుపై ధర్నా చేశారు. దమ్మన్నపేట రైతులు ట్రాన్స్ఫార్మర్ వద్ద నిరసన తెలిపారు. యూరియా కొరత, కరెంట్ కోతలపై రుద్రంగిలోని సబ్‌స్టేషన్ వద్ద రైతులతో కలిసి సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం రోడ్డుపై బైఠాయించారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మం డలం పాతదాంరాజ్‌పల్లి, సంగెం-శ్రీరాంపూ ర్, వాల్గొండ గ్రామాలకు చెందిన రైతులు కొత్తదాంరాజ్పల్లిలోని సబ్‌స్టేషన్ ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించారు. రాయికల్ సబ్‌స్టేషన్ ఎదుట జగిత్యాల-రాయికల్ ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు.

హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు కరెంట్ కనెక్షన్ల జారీ సమస్యగా మారింది. వీటికి డిస్కమ్‌ల ఇంజినీర్లు కరెంట్ కనెక్షన్లు జారీ చేయడంలేదు. దీంతో నిర్మాణానికి అడ్డంకులు ఎదురవుతున్నాయి. పలు స్కూళ్లలో నిర్మాణ పనులు నడుస్తుండగా, తాత్కాలిక విద్యుత్తు కనెక్షన్లతో నెట్టుకొస్తున్నారు. ఈ గురుకులాలకు కనెక్షన్లు జారీచేయాలని ఉత్తర, దక్షిణ డిస్కమ్‌ల సీఎండీలు ఇంజినీర్లకు ఆదేశాలిచ్చినా సమస్య పరిష్కారం కావడం లేదు.