Asian Games | టేబుల్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్‌లో కాంస్యం.. సాత్విక్- చిరాగ్ తొలి రౌండ్ దాటలే..!
Asian Games : ఆసియా క్రీడల్లో ఆరో రోజు భారత బృందానికి వరసగా షాక్‌లు తగిలాయి. అంతర్జాతీయ వేదికల్లో దుమ్మరేపుతున్న భారత డబుల్స్ ద్వయం తొలి రౌండ్లోనే వెనుదిరిగింది.
Asian Games : ఆసియా క్రీడల్లో ఆరో రోజు భారత బృందానికి వరసగా షాక్‌లు తగిలాయి. అంతర్జాతీయ వేదికల్లో దుమ్మరేపుతున్న భారత డబుల్స్ ద్వయం తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. ఫేవరెట్ అయిన సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టిల జోడీని థాయ్‌లాండ్ జంట చిత్తు చేసింది. ఇక కామన్వెల్త్ క్రీడల్లో పతకంతో మెరిసిన బాక్సర్ ప్రీతి పవార్ (Preeti Pawar) సైతం 16వ రౌండ్లోనే నిష్క్రమించింది. అయితే.. టేబుల్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్‌లో భారత ద్వయం అదరగొట్టింది. మనుష్ షా, దియా చిటాలేలు చైనా జంటను చిత్తు చేసి కాంస్యంతో మురిసింది.
జపాన్ వేదికగా జరుగుతున్న పద్దెనిమిదో ఆసియా క్రీడల్లో భారత స్టార్ డబుల్స్ జంట సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి పోరాటం ముగిసింది. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఈ జంట పురుషుల విభాగంలో పతకం గెలుస్తారనుకుంటే తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పీరట్చాయ్ సుఖ్‌ఫున్ – పక్కాపొన్ తీరరాత్సకుల్(థాయ్‌లాండ్) ద్వయం దూకుడు ముందు భారత జోడీ నిలవలేకపోయింది. మొదటి సెట్‌ను 21-12తో గెలుపొందిన సాత్విక్ – చిరాగ్ జంట ఆపై తడబడింది. గొప్పగా పుంజుకున్న థాయ్ షట్లర్లు.. వరసగా 21-19, 21-14తో రెండు సెట్లలో సత్తా చాటారు. దాంతో.. సాత్విక్ – చిరాగ్ జోడీ నిరాశతో టోర్నీని వీడింది.
🏸 DEFENDING CHAMPIONS OUT! 🇮🇳💥
Satwik & Chirag lost in their #AsianGames2026 men’s doubles first round match!#TeamIndia #Badminton #SatwikChirag #IndiaSportsHub pic.twitter.com/qUvGsQy8XN
— IndiaSportsHub (@IndiaSportsHub) September 25, 2026
కాంస్య గర్జన
టేబుల్ టెన్నిస్‌లో వ్యక్తిగతంగా విఫలమైన భారత బృందం.. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో చెలరేగింది. మనుషా షా, దియా చిటాలే బృందం సెమీస్‌లో ఓడినా కాంస్యం పట్టేసింది. శుక్రవారం చైనా జంట వాంగ్ చుకిన్ – సున్ ఇంక్షా ధాటికి మనుషా, దియా సమాధానం ఇవ్వలేకపోయారు. మ్యాచ్‌లో సంపూర్ణ ఆధిపత్యం చెలాయించిన చైనా జోడీ.. 11-5, 11-8, 11-8తో గెలుపొంది ఫైనల్లో అడుగుపెట్టింది.
🥉 BRONZE FOR INDIA! 🇮🇳🔥
Manush Shah & Diya Chitale win BRONZE in the Mixed Doubles event at #AsianGames2026! 🏓
Another medal for Team India! 🇮🇳👏#TeamIndia #TableTennis #AsianGames2026 #IndiaSportsHub pic.twitter.com/niG1gMQJ8O
— IndiaSportsHub (@IndiaSportsHub) September 25, 2026
ప్రీతి పంచ్ అదరలే
ఇటీవలే కామన్వెల్త్ క్రీడల్లో పసిడి పతకం కొల్లగొట్టిన ప్రీతి పవార్ ఆసియా క్రీడల్లో మాత్రం అంచనాలు అందుకోలేదు. మహిళల 54 కిలోల విభాగంలో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ప్రీతి తొలి రౌండ్లోనే అనూహ్యంగా కంగుతిన్నది. ఉత్తర కొరియా బాక్సర్ చొల్ మి పాంగ్ ధాటికి వరసగా రెండు రౌండ్లలో తేలిపోయిన భారత స్టార్ ఓటమితో నిరాశపరిచింది. గత ఆసియాడ్‌లో కాంస్యంతో మెరిసిన తను.. ఈసారి ఉత్త చేతులతోనే స్వదేశం రానుంది.
DEFENDING CHAMPION PROVES TOO STRONG! 🥊
Indian boxer Preeti Pawar bows out of the Asian Games 2026 after a highly competitive opening bout.
Preeti put up a gritty performance in the ring but lost to the reigning defending champion Pan Chol Mi via a unanimous 5-0 verdict.… pic.twitter.com/2zgxb1NSLr
— Anil Bansal (@dilseanilbansal) September 25, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
Bathukamma | బతుకమ్మకూ నీళ్లులేవు.. కాంగ్రెస్ తెచ్చిన దుర్గతి… వరంగల్ జిల్లా ఆరెపల్లిలో కాలువకు బావినీరే గతి
IND vs WI | ఎవరిదో ఫైనల్ పంచ్.. నేడు భారత్-వెస్టిండీస్ చివరి టీ20!
Starlink vs Jio | పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
Nominated Posts | నీకు పదవొస్తే.. నాకెంతిస్తావ్.. వరంగల్ సహా దక్షిణాది జిల్లాల్లో పదవికో రేట్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

