CEO Sudarshan Reddy | ప్రతి పౌరుడు ఓటు హక్కును నమోదు చేసుకోవాలి : సీఈవో సుదర్శన్ రెడ్డి
CEO Sudarshan Reddy | ఓటు హక్కు ఉన్న ప్రతి పౌరుడు ఓటు హక్కును నమోదు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి (సూచించారు.
వికారాబాద్ : ఓటు హక్కు ఉన్న ప్రతి పౌరుడు ఓటు హక్కును నమోదు ( Vote register ) చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి (CEO Sudarshan Reddy) సూచించారు. వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాల ను శుక్రవారం పరిశీలించారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా పోలింగ్ కేంద్రాల్లో బూత్ స్థాయి అధికారుల పనితీరును ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
తాండూర్ పట్టణంలోని పాత మున్సిపాలిటీ, ఎంపీటీ హాల్, గౌతాపూర్ ప్రాంతాల్లో ఉన్న పోలింగ్ కేంద్రాలను ఆన సందర్శించి బీఎల్వోలు నిర్వహిస్తున్న ఓటరు నమోదు, నోటీసుల పంపిణీ, ధ్రువీకరణ పత్రాల స్వీకరణ తదితర ప్రక్రియలను పరిశీలించారు.
ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 60 శాతం ఓటర్లకు నోటీసులు అందజేసినట్లు తెలిపారు. వికారాబాద్ జిల్లాలో మాత్రం 72 శాతం నోటీసుల పంపిణీ పూర్తయినట్లు వెల్లడించారు.
నోటీసులు అందుకున్న ఓటర్లు అందులో పేర్కొన్న వివరాల ప్రకారం అవసరమైన సంబంధిత ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలని సూచించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్క పౌరుడు ఓటరుగా నమోదు చేసుకునే అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. ఓటరుగా నమోదు చేసుకోవడానికి వ్యక్తిగతంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఉందని వివరించారు. అలాగే ఆయా ప్రాంతాల్లోని బీఎల్వోల సహకారంతో కూడా ఓటరు నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని తెలిపారు.
తాండూర్ ఆర్డీవో కార్యాలయంలో తహసీల్దార్లు, ఎంపీడీవోలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ, అదనపు కలెక్టర్ వెంకటాచారి, ట్రైనీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ , ఆర్డీవో అనిత, తహసీల్దార్ తారా సింగ్, డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | ఎన్హెచ్ఎం ఉద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు : కేటీఆర్
Divya Mittal: జన నీతి భారత్ పార్టీ పెట్టిన మాజీ ఐఏఎస్ దివ్యా మిట్టల్
Dasoju Shravan Kumar | రేవంత్ రెడ్డి అనే మహమ్మారి వచ్చినంక కరెంట్ కూడా పూర్తిగా సర్వనాశనమైపోతుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
‘అర్హులైన గ్రాడ్యూయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలి’
Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

