Ex-MLA’s Son Charred Body Found | కారులో మాజీ ఎమ్మెల్యే కుమారుడి కాలిన మృతదేహం.. హత్యగా అనుమానం
Ex-MLA's Son Charred Body Found | మాజీ ఎమ్మెల్యే కుమారుడి కాలిన మృతదేహాన్ని దగ్ధమైన కారులో గుర్తించారు. ఆయనను హత్య చేసి మృతదేహాన్ని కారులో ఉంచి నిప్పంటించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
బెంగళూరు: మాజీ ఎమ్మెల్యే కుమారుడి కాలిన మృతదేహాన్ని దగ్ధమైన కారులో గుర్తించారు. ఆయనను హత్య చేసి మృతదేహాన్ని కారులో ఉంచి నిప్పంటించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. (Ex-MLA’s Son Charred Body Found) కర్ణాటకలోని బెళగావి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మంగళవారం తెల్లవారుజామున ధార్వాడ్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో కాలిపోయిన కారును స్థానికులు గుర్తించారు. కాలిన వ్యక్తి మృతదేహం లోపల ఉండటం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కాగా, కారు నంబర్ ప్లేట్ ఆధారంగా బైల్‌హొంగల్ మాజీ ఎమ్మెల్యే బాబూరావు బోలశెట్టి కుమారుడు రాజు బోలశెట్టిగా మృతుడ్ని పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలం నుంచి ఒక ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఫోరెన్సిక్ నిపుణులను రప్పించి ఆధారాలు సేకరించారు.
మరోవైపు ఉడికేరి గ్రామంలో నివసిస్తూ వ్యవసాయం చేసుకునే రాజును ఎక్కడో హత్య చేసి అతడి కారులో రామాపూర్ శివారుకు తరలించి ఆ వాహనంతో సహా నిప్పుపెట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. మాజీ ఎమ్మెల్యే కుమారుడ్ని ఎవరు, ఎందుకు హత్య చేశారు అన్నది అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
MBBS Student Suicide | ఆన్లైన్ గేమ్‌లో డబ్బులు కోల్పోయి.. ఎంబీబీఎస్ విద్యార్థి ఆత్మహత్య
Kotak Mahindra Fraud | హర్యానాలో ఐడీఎఫ్సీ తర్వాత.. కోటక్ మహీంద్రా బ్యాంకులో రూ.160 కోట్ల మోసం
Use piped gas | పైప్ గ్యాస్‌కు మారండి.. లేకపోతే ఎల్పీజీ సరఫరా నిలిపివేత: కేంద్రం
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- car
- charred body
- Ex MLA
- karnataka
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

